మర్యాదగా తప్పుకున్న వర్ల రామయ్య
ప్రభుత్వం మారగానే చాలా మంది టీడీపీ నేతలు వారి నామినేటెడ్ పదవులకు రాజీనామా చేశారు. వర్ల రామయ్య మాత్రం రాజీనామా చేయలేదు. ఇప్పటికీ ఆర్‌టీసీ చైర్మన్‌గా కొనసాగుతూ వచ్చాడు. స్వచ్చందంగా రాజీనామా చేసేందుకు తొలుత ఆయన ససేమిరా అంటూ వచ్చాడు. దాంతో గత నెల 28న ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. స్వచ్ఛందంగా తప్పుకుంటారా లేక తామే తప్పించాలా… అంటూ నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లోగా రాజీనామా చేయాలని లేదంటే తామే తొలగిస్తామని రవాణా శాఖ […]
ప్రభుత్వం మారగానే చాలా మంది టీడీపీ నేతలు వారి నామినేటెడ్ పదవులకు రాజీనామా చేశారు. వర్ల రామయ్య మాత్రం రాజీనామా చేయలేదు. ఇప్పటికీ ఆర్‌టీసీ చైర్మన్‌గా కొనసాగుతూ వచ్చాడు. స్వచ్చందంగా రాజీనామా చేసేందుకు తొలుత ఆయన ససేమిరా అంటూ వచ్చాడు. దాంతో గత నెల 28న ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
స్వచ్ఛందంగా తప్పుకుంటారా లేక తామే తప్పించాలా… అంటూ నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లోగా రాజీనామా చేయాలని లేదంటే తామే తొలగిస్తామని రవాణా శాఖ నోటీసు ఇచ్చింది.
ప్రభుత్వం ఇచ్చిన గడువులోగానే వర్ల రామయ్య రాజీనామా చేశాడు. ఆర్టీసీ చైర్మన్ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖను రవాణా శాఖ ముఖ్య కార్యదర్శికి వర్ల రామయ్య పంపించాడు.