ఇక మారడానికి పార్టీ లేదు.... దిక్కు తోచని నేత

ఏపీలో ఎన్నికలు ముగిసి.. ఆధికారం మారి 4 నెలలు గడిచింది. 5 సంవత్సరాల రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారిన నేతలు ఎందరో ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు.. ఇలాంటి పరిస్థితిని చిత్తూరు లో ఓ నేత ఎదుర్కొంటున్నాడు. సీకే బాబు అలియాస్ సీకే జయచంద్రా రెడ్డి. చిత్తూరు రాజకీయాల్లో పరిచయం అక్కరలేని మాస్ లీడర్. 1985 లో ఏ కండువా కప్పుకోకుండానే పోలికల్ ఎంట్రి ఇచ్చారు. తరువాత మున్సిపల్ కౌన్సిలర్ గా, చైర్మన్ గా […]

Advertisement
Update:2019-10-25 15:30 IST

ఏపీలో ఎన్నికలు ముగిసి.. ఆధికారం మారి 4 నెలలు గడిచింది. 5 సంవత్సరాల రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారిన నేతలు ఎందరో ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు.. ఇలాంటి పరిస్థితిని చిత్తూరు లో ఓ నేత ఎదుర్కొంటున్నాడు.

సీకే బాబు అలియాస్ సీకే జయచంద్రా రెడ్డి. చిత్తూరు రాజకీయాల్లో పరిచయం అక్కరలేని మాస్ లీడర్. 1985 లో ఏ కండువా కప్పుకోకుండానే పోలికల్ ఎంట్రి ఇచ్చారు. తరువాత మున్సిపల్ కౌన్సిలర్ గా, చైర్మన్ గా రాణించారు.1989లో ఇండిపెండెంట్ గా.. తరువాత 1994లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో విజయం సాధించారు. 2004లో సీకే ఓడిపోయారు. తరువాత తిరిగి 2009లో ఎమ్ ఎల్ఎ గా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

వైఎస్ మృతితో సీకే రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు దూరం అయిన సీకే 2014 లో పోటీచేసేందుకు ఏ పార్టీ అభ్యర్థిత్వం దొరకలేదు. చివరికి వైసీపీలో చేరి ఆ పార్టీ ఆభ్యర్థి కోసం పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం బీజేపీలోకి మారారు. అక్కడ ఏంచేసేది లేక తిరిగి వైసిపీలోకి వచ్చేందుకుగాను విశ్వ ప్రయత్నాలు చేశారు.

అయితే వైసీపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి… సీకే రాకకు బ్రేకులు వేయడంతో బీజేపీలో ఉండలేక వైసీపీలో చేరలేక నానా ఇబ్బందులు పడ్డారు. చివరకు 2019 లో ఎన్నికల ముందు టీడీపీలోకి వలస వెళ్లారు. చిత్తూరుతో పాటు పుతలపట్టు, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు కోసం సీకే బాబు శ్రమించారు. కానీ వైసీపి ప్రభంజనంలో సీకే పాచీకలు పారలేదు . టీడీపీలో ఏం చేయాలో తెలియక సీకే వర్గం సైలెంట్ అయ్యింది. ఇప్పుడు ఎటువెళ్లాలో తెలియక వైసీపీలోకి వెళ్లే అవకాశం లేదు. మరో వైపు టీడీపీలోనూ యాక్టివ్ గా లేని సీకే ఏం చేస్తారని చూస్తున్నారు అయన అనుచరులు. ఒకప్పుడు చిత్తూరు రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన సీకే పొలిటికల్ ప్యూచర్ ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది.

Tags:    
Advertisement

Similar News