డెంగ్యూతో చనిపోతే 50 లక్షల నష్టపరిహారం " హైకోర్టు

తెలంగాణలో డెంగ్యూ మరణాలపై హైకోర్టు సీరియస్ అయింది. ఎలాంటి నివారణ చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించింది. తాము నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ ఎస్కే జోషి ఇచ్చిన వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎస్‌ చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. డెంగ్యూ మరణాలపై తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. సీఎస్ స్వయంగా వెళ్లి మూసీ నదిని సందర్శించాలని కోర్టు ఆదేశించింది. […]

Advertisement
Update:2019-10-24 15:35 IST

తెలంగాణలో డెంగ్యూ మరణాలపై హైకోర్టు సీరియస్ అయింది. ఎలాంటి నివారణ చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించింది. తాము నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ ఎస్కే జోషి ఇచ్చిన వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎస్‌ చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. డెంగ్యూ మరణాలపై తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.

సీఎస్ స్వయంగా వెళ్లి మూసీ నదిని సందర్శించాలని కోర్టు ఆదేశించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా నగరాల మధ్యలోనే నదులు ఉన్నాయని.. అక్కడ నమోదు కాని డెంగ్యూ కేసులు ఇక్కడే ఎందుకు నమోదు అవుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. 30 రోజుల ప్రణాళికతో ఏం సాధించారని గట్టిగా ప్రశ్నించింది.

ప్రణాళికలన్నీ పేపర్లకు పరిమితం చేశారని… వాస్తవంగా ఏమీ చేయడం లేదని మండిపడింది. మూసికి పక్కనే ఉన్న హైకోర్టులో కూడా విపరీతంగా దోమలు ఉన్నాయని న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. జనవరిలో 85 డెంగ్యూ కేసులు నమోదైతే… అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 3వేల800లకు పెరిగిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

డెంగ్యూ నివారణలో ప్రభుత్వం విఫలమైతే మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు నష్టపరిహారం అందించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.

Tags:    
Advertisement

Similar News