బైక్‌పై వచ్చిన రేవంత్ రెడ్డి.... ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఇవాళ ఉదయం నుంచే కాంగ్రెస్ ముఖ్యనాయకులను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. ప్రగతి భవన్ వద్దకు ఎవరూ రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. మెట్రో రైళ్లో వచ్చే అవకాశం ఉందని భావించి బేగంపేట మెట్రో స్టేషన్ మూసేశారు. అక్కడ ఏ ట్రైన్‌ను కూడా ఆపడం లేదు. ఆ మేరకు ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఇక ఉదయం నుంచి […]
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఇవాళ ఉదయం నుంచే కాంగ్రెస్ ముఖ్యనాయకులను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. ప్రగతి భవన్ వద్దకు ఎవరూ రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. మెట్రో రైళ్లో వచ్చే అవకాశం ఉందని భావించి బేగంపేట మెట్రో స్టేషన్ మూసేశారు. అక్కడ ఏ ట్రైన్‌ను కూడా ఆపడం లేదు. ఆ మేరకు ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చారు.
ఇక ఉదయం నుంచి అజ్ఞాతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బైక్‌పై ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయనను అడ్డుకొని అదుపులోనికి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులకు, రేవంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆయన నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని.. వెంటనే చర్చలు జరిపాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రగతిభవన్ గేట్లను తాకుతామని.. రేపు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ప్రగతిభవన్ గేట్లను బద్దలు కొట్టడం ఖాయమని ఆయన ఛాలెంజ్ విసిరారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబులను హౌస్ అరెస్టు చేశారు. ఆటోలో ప్రగతిభవన్‌వైపు వెళ్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
ఇక ప్రగతిభవన్ వైపు దూసుకొని వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల నడుమ తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.