ఊడి వచ్చిన పడవ పైభాగం...

గోదావరిలో నెల క్రితం మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించడం లేదు. గోదావరి వరద తగ్గడంతో డీప్ డైవర్స్ వెళ్లి రోప్‌లకు లంగరు తగిలించి వచ్చారు. ఆ రోప్‌ల సాయంతో బోటును బయటకు లాగే ప్రయత్నం చేయగా… పైభాగం మాత్రమే బయటకు వచ్చింది. పడవ 60 అడుగుల లోతులో ఇసుకలో కూరుకుపోయి ఉండడంతో పూర్తిగా బయటకు రాలేదు. పై భాగం మాత్రమే తెగి వచ్చింది. నెల రోజులకు పైగా నీటిలో ఉండడంతో పడవ దెబ్బతిని… […]

Advertisement
Update:2019-10-21 10:22 IST

గోదావరిలో నెల క్రితం మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించడం లేదు. గోదావరి వరద తగ్గడంతో డీప్ డైవర్స్ వెళ్లి రోప్‌లకు లంగరు తగిలించి వచ్చారు. ఆ రోప్‌ల సాయంతో బోటును బయటకు లాగే ప్రయత్నం చేయగా… పైభాగం మాత్రమే బయటకు వచ్చింది. పడవ 60 అడుగుల లోతులో ఇసుకలో కూరుకుపోయి ఉండడంతో పూర్తిగా బయటకు రాలేదు. పై భాగం మాత్రమే తెగి వచ్చింది.

నెల రోజులకు పైగా నీటిలో ఉండడంతో పడవ దెబ్బతిని… ఇలా విడిభాగాలుగా ఊడివస్తోందని చెబుతున్నారు. లంగరు ను కూడా బోటు పైభాగానికి వేయడంతో అలా సగ భాగం ఊడివచ్చినట్టు భావిస్తున్నారు.

ఈసారి డైవర్స్ వెళ్లి బోటు ఇంజన్ భాగానికి లంగర్ వేసి వస్తే అప్పుడు మాత్రమే పడవ పూర్తి స్థాయిలో బయటకు రావొచ్చు అని భావిస్తున్నారు.

ఇసుకలో కూరుకుపోవడం వల్లే బోటు బయటకు రావడం ఇబ్బందిగా మారుతోందంటున్నారు. ప్రస్తుతం సగభాగం ఊడిపోయి వచ్చిన నేపథ్యంలో సత్యం బృందం మరోసారి డైవర్స్‌ను పంపి ఈసారి పూర్తిగా బోటు బయటకు వచ్చేలా లంగరు వేసి రానుంది.

Tags:    
Advertisement

Similar News