విమానంలో తీసుకెళ్లలేదని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లో విషాద ఘటన జరిగింది. విమానంలో తిరుపతి వెళ్లేందుకు భర్త అంగీకరించకపోవడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. గుంటూరుకు చెందిన ప్రవళ్లిక మాదాపూర్‌లోని ఆదిత్య బిల్లా సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు 2014లో వెంకటరమణతో వివాహం అయింది. వీరికి తొమ్మిది నెలల కుమార్తె ఉంది. కుమార్తెకు పుట్టువెంట్రుకలు తీయించేందుకు తిరుపతి వెళ్లాలని భావించారు. వెంకటరమణ, ప్రవళ్లికతో పాటు అతడి తల్లిదండ్రులను కూడా తిరుపతి తీసుకెళ్లేందుకు రైలు టికెట్లను కూడా బుక్ చేసుకున్నారు. […]

Advertisement
Update:2019-10-18 09:22 IST

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లో విషాద ఘటన జరిగింది. విమానంలో తిరుపతి వెళ్లేందుకు భర్త అంగీకరించకపోవడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది.

గుంటూరుకు చెందిన ప్రవళ్లిక మాదాపూర్‌లోని ఆదిత్య బిల్లా సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు 2014లో వెంకటరమణతో వివాహం అయింది. వీరికి తొమ్మిది నెలల కుమార్తె ఉంది.

కుమార్తెకు పుట్టువెంట్రుకలు తీయించేందుకు తిరుపతి వెళ్లాలని భావించారు. వెంకటరమణ, ప్రవళ్లికతో పాటు అతడి తల్లిదండ్రులను కూడా తిరుపతి తీసుకెళ్లేందుకు రైలు టికెట్లను కూడా బుక్ చేసుకున్నారు. కానీ అనివార్యకారణాలతో ఈనెల 10 జరగాల్సిన ప్రయాణం వాయిదా పడింది.

కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం ఇష్టం లేని ప్రవళ్లిక… భర్త, కుమార్తెతో కలిసి విమానంలో తిరుపతి వెళ్లాలని భావించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. అయితే అతడు అంగీకరించలేదు. రెండు వారాలు ఆగి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ధామని సర్దిచెప్పాడు. కానీ ఆమె వినలేదు. ఈ విషయంలో మూడునాలుగు రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది.

ఇంతలోనే బుధవారం సాయంత్రం ఆఫీస్‌ నుంచి వచ్చిన ప్రవళ్లిక భర్తతో మాట్లాకుండా నేరుగా తన గదికి వెళ్లి తలుపులేసుకుంది. భార్య మూడాఫ్‌లో ఉంది కాబోలు అని వెంకటరమణ పట్టించుకోలేదు. కానీ ఎంతకీ తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా అప్పటికే ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతోంది.

స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News