సింధూ పరాజయాల హ్యాట్రిక్

ప్రపంచ టైటిల్ తర్వాత వరుసగా మూడో ఓటమి ప్రపంచ చాంపియన్ పీవీ సింధు పరిస్థితి.. ఇంత బతకూబతికి.. అన్నట్లుగా తయారయ్యింది. ప్రపంచ టైటిల్ సాధించిన తర్వాత…వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. చిన్నచిన్న ప్లేయర్ల చేతిలోనే ఓటమి పొందుతూ అయోమయంలో చిక్కుకొంది. గత నెలలో జరిగిన చైనా ఓపెన్ రెండో రౌండ్, కొరియా ఓపెన్ తొలిరౌండ్లోనే పరాజయాలు చవిచూసిన 5వ సీడ్ సింధుకు… 2019 డెన్మార్క్ ఓపెన్ రెండోరౌండ్లోనూ ఓటమి తప్పలేదు. టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ లో బంగారు […]

Advertisement
Update:2019-10-18 03:22 IST
  • ప్రపంచ టైటిల్ తర్వాత వరుసగా మూడో ఓటమి

ప్రపంచ చాంపియన్ పీవీ సింధు పరిస్థితి.. ఇంత బతకూబతికి.. అన్నట్లుగా తయారయ్యింది. ప్రపంచ టైటిల్ సాధించిన తర్వాత…వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. చిన్నచిన్న ప్లేయర్ల చేతిలోనే ఓటమి పొందుతూ అయోమయంలో చిక్కుకొంది.

గత నెలలో జరిగిన చైనా ఓపెన్ రెండో రౌండ్, కొరియా ఓపెన్ తొలిరౌండ్లోనే పరాజయాలు చవిచూసిన 5వ సీడ్ సింధుకు… 2019 డెన్మార్క్ ఓపెన్ రెండోరౌండ్లోనూ ఓటమి తప్పలేదు.

టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్న సింధు…సన్నాహకంగా పాల్గొంటున్న మూడుటోర్నీలలోనూ పరాజయాలు పొందటం ఆందోళన కలిగిస్తోంది.

డెన్మార్క్ లోని ఓడెన్సీ వేదికగా ముగిసిన డేనిష్ ఓపెన్ లో కొరియా యువప్లేయర్, 17 ఏళ్ల యాన్ సీ యంగ్ వరుస గేమ్ ల్లో 21-14, 21- 17తో ప్రపంచ చాంపియన్ సింధు పై సంచలన విజయం సాధించింది.

19వ ర్యాంకర్ కొరియా ప్లేయర్ కు ప్రపంచ చాంపియన్ సింధు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

సమీర్ వర్మ, సాయి ప్రణీత్ అవుట్…

పురుషుల సింగిల్స్ లో సైతం భారత ఆటగాళ్లు సమీర్ వర్మ, సాయి ప్రణీత్ లకు పరాజయాలు తప్పలేదు. చైనా ఆటగాడు చెన్ లాంగ్ చేతిలో సమీర్ వర్మ 12-21, 10-21 తో కంగు తింటే… ప్రపంచ చాంపియన్ కెంటో మోమోటో 21-6, 21-14తో సాయి ప్రణీత్ ను చిత్తు చేశాడు.

మొత్తం మీద…డేనిష్ ఓపెన్ సింగిల్స్ లో భారత్ క్రీడాకారుల పరిస్థితి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా తయారయ్యింది.

Tags:    
Advertisement

Similar News