భారీగా "జేసీ" బస్సులు సీజ్
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ రవాణా శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 23 బస్సులను సీజ్ చేశారు. జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై దాడులు చేసిన రవాణా శాఖ అధికారులు…. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం వంటి పనులను…. నిబంధనలకు విరుద్దంగా చేస్తున్నట్టు […]
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ రవాణా శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 23 బస్సులను సీజ్ చేశారు. జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు.
నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై దాడులు చేసిన రవాణా శాఖ అధికారులు…. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం వంటి పనులను…. నిబంధనలకు విరుద్దంగా చేస్తున్నట్టు గుర్తించారు. దాంతో 23 బస్సులను సీజ్ చేసినట్టు బుధవారం రాత్రి ప్రకటించారు.
నిబంధనలను అతిక్రమించినందుకు కేసులు నమోదు చేశారు. దివాకర్ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని… అందులో భాగంగానే తనిఖీలు చేశామని… విచారణ కొనసాగుతుందని రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు వెల్లడించారు.