అభ్యంతరం లేని అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేస్తాం

ఉగాది నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని వారందరికీ ఇంటి స్థలాల పంపిణీ చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలం లేని పేదలందరికీ స్థలం ఇవ్వడంతోపాటు ఇంటిని కూడా కట్టించి ఇవ్వాలని నిర్ణయించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి ఇళ్ల స్థలాలకు అర్హులైన వారిని 20 లక్షల మందిని గుర్తించినట్టు బొత్స చెప్పారు. అర్హులైన వారు ఇంకా ఉంటే పరిగణనలోకి […]

Advertisement
Update:2019-10-17 13:03 IST

ఉగాది నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని వారందరికీ ఇంటి స్థలాల పంపిణీ చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలం లేని పేదలందరికీ స్థలం ఇవ్వడంతోపాటు ఇంటిని కూడా కట్టించి ఇవ్వాలని నిర్ణయించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి ఇళ్ల స్థలాలకు అర్హులైన వారిని 20 లక్షల మందిని గుర్తించినట్టు బొత్స చెప్పారు. అర్హులైన వారు ఇంకా ఉంటే పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

పేదల కోసం పట్టణ ప్రాంతాల్లో జీ+ తరహాలో నిర్మాణం చేయడం వల్ల వాటి నిర్వాహణలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. దీని కారణంగానే పట్టణాల్లో కూడా వీలైనంత వరకు ఇళ్ల స్థలాలను వ్యక్తిగతంగానే ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. పట్టణాల్లో లబ్ది దారుల కోసం మొత్తం 11 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని… ఇప్పటికే 2వేల 500 ఎకరాలను గుర్తించినట్టు చెప్పారు.

పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కోసం భూములను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందుకు 12వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. పట్టణాల్లో ఒక్కొక్కరికి సెంట్‌ భూమి, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్ భూమి ఇస్తామన్నారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామన్నారు.

పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని విధంగా ఉన్నచోట పేదలు ఇళ్లు నిర్మించుకుని ఉంటే ఆ స్థలాలను రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News