కేసీఆర్ పై బీజేపీ ఆపరేషన్ మొదలైందా?

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. వారం గడిచాక ఇప్పుడు సీన్ లోకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నుంచి ఎంపీలు బండి సంజయ్, అరవింద్ సహా కీలక బీజేపీ నేతలంతా ఆర్టీసీ కార్మికుల కోసం రోడ్డెక్కారు. ఆందోళనలు చేశారు. ఇక కేసీఆర్ సర్కారుపై కేంద్రం ఏరికోరి నియమించిన గవర్నర్ తమిళిసై తన తొలి నివేదికను ఇచ్చినట్టు తెలిసింది. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న […]

Advertisement
Update:2019-10-16 08:30 IST

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. వారం గడిచాక ఇప్పుడు సీన్ లోకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నుంచి ఎంపీలు బండి సంజయ్, అరవింద్ సహా కీలక బీజేపీ నేతలంతా ఆర్టీసీ కార్మికుల కోసం రోడ్డెక్కారు. ఆందోళనలు చేశారు.

ఇక కేసీఆర్ సర్కారుపై కేంద్రం ఏరికోరి నియమించిన గవర్నర్ తమిళిసై తన తొలి నివేదికను ఇచ్చినట్టు తెలిసింది. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులను, తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను అందులో పొందుపరిచినట్టు తెలుస్తోంది. పదకొండు రోజులుగా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ను తమిళిసై అందజేసినట్టు సమాచారం.

పండుగ వేళ తెలంగాణలో స్తంభించిన ప్రజారవాణా సమస్యను కేసీఆర్ గాలికి వదిలేసిన తీరుపై గవర్నర్ తమిళిసై నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది.

ఇక క్షేత్ర స్థాయిలో బీజేపీ శ్రేణులు కూడా టీఆర్ఎస్ సర్కారుతో సై అంటే సై అంటున్నాయి. పోరుబాట పడుతున్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కేసీఆర్ సర్కారు చర్యలపై జరుగుతున్న ఈ ఆపరేషన్ ఎటువైపు దారితీస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది..

Tags:    
Advertisement

Similar News