పూణే టెస్టులో భారత్ పరుగుల వెల్లువ
అజేయ డబుల్ సెంచరీతో విరాట్ కొహ్లీ షో భారత్ 5 వికెట్లకు 601 పరుగులకు డిక్లేర్ సౌతాఫ్రికాతో తీన్మార్ టెస్ట్ సిరీస్ లో భాగంగా…పూణే లోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరుగుతున్నరెండోటెస్ట్ రెండోరోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. రికార్డుల మోత మోగించడమే కాదు…254 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు. భారత్ 5 వికెట్లకు 601 పరుగుల భారీస్కోరుతో డిక్లేర్ చేయడంలో ప్రధానపాత్ర వహించాడు. కొహ్లీ 26వ టెస్ట్ […]
- అజేయ డబుల్ సెంచరీతో విరాట్ కొహ్లీ షో
- భారత్ 5 వికెట్లకు 601 పరుగులకు డిక్లేర్
సౌతాఫ్రికాతో తీన్మార్ టెస్ట్ సిరీస్ లో భాగంగా…పూణే లోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరుగుతున్నరెండోటెస్ట్ రెండోరోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. రికార్డుల మోత మోగించడమే కాదు…254 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు.
భారత్ 5 వికెట్లకు 601 పరుగుల భారీస్కోరుతో డిక్లేర్ చేయడంలో ప్రధానపాత్ర వహించాడు.
కొహ్లీ 26వ టెస్ట్ శతకం…
తొలిరోజు ఆట ముగిసే సమయానికి సాధించిన స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన భారత్ కు…కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే 4వ వికెట్ కు భారీభాగస్వామ్యంతో పరుగులవేటను కొనసాగించారు.
కెప్టెన్ గా తన కెరియర్ లో 50 మ్యాచ్ ఆడుతున్న విరాట్ కొహ్లీ…173 బాల్స్ లో 16 బౌండ్రీలతో 100 పరుగుల స్కోరు సాధించాడు. 2019 సీజన్ టెస్ట్ మ్యాచ్ ల్లో విరాట్ కొహ్లీకి ఇదే తొలిశతకం కావడం విశేషం.
మరోవైపు…అజంక్యా రహానే సైతం…141 బాల్స్ లో 8 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరకు స్పిన్నర్ మహారాజ్ బౌలింగ్ లో కీపర్ డి కాక్ పట్టిన క్యాచ్ కు చిక్కాడు.
58 పరుగుల స్కోరుకే రహానే ఇన్నింగ్స్ కు తెరపడడంతో…ఆల్ రౌండర్ జడేజా క్రీజులోకి వచ్చాడు. అప్పటికే పూణే ఎండవేడికి అలసిపోయిన సఫారీ బౌలర్లు, ఫీల్డర్లను.. కొహ్లీ-జడేజా జోడీ ఓ ఆటాడుకొన్నారు. బౌండ్రీలు, సిక్సర్ల మోత మోగించారు.
విరాట్ ప్రపంచ రికార్డు…
టెస్ట్ క్రికెట్లో కెప్టెన్ గా 150కి పైగా స్కోరును…విరాట్ కొహ్లీ 9వసారి సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్ర్రేలియన్ క్రికెట్ లెజెండ్ డోనాల్డ్ బ్రాడ్మన్ పేరుతో ఉన్న ఎనిమిది 150 స్కోర్ల రికార్డును తెరమరుగు చేశాడు.
కొహ్లీ మొత్తం 241 బాల్స్ ఎదుర్కొని 23 బౌండ్రీలతో ఈ ఘనత సాధించాడు. కొహ్లీ- జడేజా 5వ వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం సాధించడంతో.. భారత్…156.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 601 పరుగులు సాధించగలిగింది.
జడేజా 104 బాల్స్ లో 8 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 91 పరుగులకు అవుట్ కావడంతో…భారత్ తన ఇన్నింగ్స్ ముగించినట్లు ప్రకటించింది.
కెప్టెన్ విరాట్ కొహ్లీ…336 బాల్స్ల్ లో 2 సిక్సర్లు, 33 బౌండ్రీలతో 254 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
టెస్ట్ క్రికెట్లో కొహ్లీకి ఇది 7వ డబుల్ సెంచరీ మాత్రమే కాదు…అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా కావడం విశేషం.
ఉమేశ్ దెబ్బ మీద దెబ్బ… భారత్ భారీస్కోరుకు సమాధానంగా బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా…13 పరుగుల స్కోరుకే ఓపెనర్లు మర్కరమ్, ఎల్గర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.
సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్టుజట్టులో చోటు సంపాదించిన ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్…సఫారీ ఓపెనర్లను సఫా చేసి… తనజట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు.