ప్రపంచ బాక్సింగ్ సెమీస్ లో మేరీకోమ్ కు షాక్
కాంస్యంతో ముగిసిన మేరీకోమ్ టైటిల్ వేట 8 ప్రపంచ పతకాల మేరీకోమ్ 2019 మహిళా ప్రపంచకప్ బాక్సింగ్ సెమీస్ లోనే భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ పోటీ ముగిసింది. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం.. తనకు అంతగా అనుకూలం కాని 51 కిలోల బరిలోకి దిగిన మేరీకోమ్ బంగారు పతకం సాధించలేకపోయింది. చివరకు కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మేరీ ఖాతాలో 8వ పతకం…. మహిళా ప్రపంచ బాక్సింగ్ లో 9వసారి పోటీకి దిగిన 36 […]
- కాంస్యంతో ముగిసిన మేరీకోమ్ టైటిల్ వేట
- 8 ప్రపంచ పతకాల మేరీకోమ్
2019 మహిళా ప్రపంచకప్ బాక్సింగ్ సెమీస్ లోనే భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ పోటీ ముగిసింది. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం.. తనకు అంతగా అనుకూలం కాని 51 కిలోల బరిలోకి దిగిన మేరీకోమ్ బంగారు పతకం సాధించలేకపోయింది. చివరకు కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మేరీ ఖాతాలో 8వ పతకం….
మహిళా ప్రపంచ బాక్సింగ్ లో 9వసారి పోటీకి దిగిన 36 ఏళ్ల మేరీకోమ్ కు సెమీఫైనల్లో టర్కీ బాక్సర్, యూరోపియన్ చాంపియన్ బాస్ నాజ్ కాక్ రోగ్లు చేతిలో 1-4తో పరాజయం తప్పలేదు.
కేవలం 48 కిలోల విభాగంలోనే ఆరు ప్రపంచకప్ బంగారు పతకాలు సాధించిన మేరీకోమ్ కు 51 కిలోల విభాగంలో ఏమంత చెప్పుకోదగిన రికార్డు లేదు. సెమీస్ లో అంచనాలకు తగ్గట్టుగా మేరీకోమ్ రాణించలేకపోయింది.
నిబంధనల ప్రకారం సెమీస్ లో ఓడిన ఇద్దరు బాక్సర్లకు కాంస్య పతకాలు ఇచ్చే సాంప్రదాయం ఉంది. దీంతో …మేరో కోమ్ ఖాతాలో కాంస్య పతకం వచ్చి చేరింది.
ప్రస్తుత ప్రపంచకప్ వరకూ తొమ్మిదిసార్లు పోటీకి దిగిన మేరీకోమ్ కు 6 స్వర్ణపతకాలు, ఒక్కో రజత, కాంస్య పతకాలు సాధించిన ఘనత ఉంది.
మహిళా ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే అత్యధిక పతకాలు సాధించిన, అత్యంత విజయవంతమైన బాక్సర్ గా మేరీకోమ్ చరిత్ర సృష్టించింది.