మహిళా వన్డే సిరీస్ లో భారత్ రెండో గెలుపు

సౌతాఫ్రికాపై మిథాలీసేన 2-0 ఆధిక్యం రెండోవన్డేలో 5 వికెట్లతో నెగ్గిన భారత్ సౌతాఫ్రికా మహిళలతో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత్ 2-0 ఆధిక్యంతో ఖాయం చేసుకొంది. వడోదర రిలయన్స్ స్టేడియం వేదికగా ముగిసిన హైస్కోరింగ్ రెండో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది. సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 6 […]

Advertisement
Update:2019-10-12 01:25 IST
  • సౌతాఫ్రికాపై మిథాలీసేన 2-0 ఆధిక్యం
  • రెండోవన్డేలో 5 వికెట్లతో నెగ్గిన భారత్

సౌతాఫ్రికా మహిళలతో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత్ 2-0 ఆధిక్యంతో ఖాయం చేసుకొంది.

వడోదర రిలయన్స్ స్టేడియం వేదికగా ముగిసిన హైస్కోరింగ్ రెండో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది.

సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 247 పరుగుల స్కోరు సాధించింది.

సఫారీ టాపార్డర్లో…లీ 40, వూల్వర్ట్ 69,డూప్రేజ్ 44, గుడాల్ 38 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో శిఖా పాండే, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.

మిథాలీ 66 పరుగులు…

248 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్…48 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే నష్టపోయి…విజయం సొంతం చేసుకొంది. వన్ డౌన్ పూనమ్ రౌత్ 65, కెప్టెన్ మిథాలీ రాజ్ 66, హర్మన్‌ ప్రీత్ కౌర్ 39 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించారు.

సఫారీ బౌలర్లలో కకా 3 వికెట్లు సాధించింది. సిరీస్ లోని తొలివన్డే నెగ్గిన భారత్…రెండో వన్డేలో సైతం విజయం సాధించడం ద్వారా 2-0తో సిరీస్ ఖాయం చేసుకొంది.

సిరీస్ లోని ఆఖరివన్డే సైతం వడోదరా వేదికగానే…ఈనెల 14న జరుగుతుంది.

Tags:    
Advertisement

Similar News