పూణే టెస్టులో భారత్ భారీ ఆధిక్యం

ఫాలోఆన్ ఉచ్చులో సౌతాఫ్రికా సఫారీ లోయర్ ఆర్డర్ పోరాటం పూణేటెస్ట్ మూడోరోజుఆటలో భారత్ పట్టు మరింత బిగిసింది. సౌతాఫ్రికాను తొలిఇన్నింగ్స్ లో 275 పరుగులకు ఆలౌట్ చేయడం ద్వారా 326 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన సఫారీజట్టును భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ దెబ్బ మీద దెబ్బ కొట్టి కోలుకోనివ్వకుండా చేశారు. నైట్ వాచ్ మన్ నోర్కే 3, వన్ డౌన్ డి బ్రూయిన్ 30, బవుమా […]

Advertisement
Update:2019-10-12 17:33 IST
  • ఫాలోఆన్ ఉచ్చులో సౌతాఫ్రికా
  • సఫారీ లోయర్ ఆర్డర్ పోరాటం

పూణేటెస్ట్ మూడోరోజుఆటలో భారత్ పట్టు మరింత బిగిసింది. సౌతాఫ్రికాను తొలిఇన్నింగ్స్ లో 275 పరుగులకు ఆలౌట్ చేయడం ద్వారా 326 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన సఫారీజట్టును భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ దెబ్బ మీద దెబ్బ కొట్టి కోలుకోనివ్వకుండా చేశారు.

నైట్ వాచ్ మన్ నోర్కే 3, వన్ డౌన్ డి బ్రూయిన్ 30, బవుమా 8 పరుగులకు అవుట్ కాగా…కెప్టెన్ డూప్లెసీ- డికాక్ 6వ వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో పరిస్థితిని కొంతమేరకు చక్కదిద్దారు.

డూప్లెసీ ఫైటింగ్ హాఫ్ సెంచరీ…

డీ కాక్ 31 పరుగులకు అవుట్ కాగా…కెప్టెన్ డూప్లెసీ 117 బాల్స్ లో 9 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 64 పరుగుల స్కోరుకు అశ్విన్ బౌలింగ్ లో చిక్కాడు.

182 పరుగులకే 8 వికెట్లు నష్టపోయిన సఫారీ టీమ్ ను కేశవ్ మహారాజ్- ఫిలాండర్ ల జోడీ 9వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకొన్నారు.

మహారాజ్ తొలి హాఫ్ సెంచరీ…

పూణేటెస్టులోనే వంద వికెట్ల మైలురాయిని చేరిన సఫారీ స్పిన్ ఆల్ రౌండర్ కేశవ్ మహారాజ్ తన కెరియర్ లో తొలిటెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు.

భుజానికి గాయమైనా…భరించలేని నొప్పితోనే తన పోరాటం కొనసాగించాడు. భారత పేసర్లు, స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొని… 132 బాల్స్ లో 12 బౌండ్రీలతో 72 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

మహారాజ్ ను అశ్విన్ అవుట్ చేయగా ఫిలాండర్ 44 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. మొత్తం మీద సఫారీటీమ్ 275 పరుగుల స్కోరుతో పాటు… భారత్ ను నిలువరించగలిగింది.

భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు, ఉమేశ్ 3 వికెట్లు, షమీ 2 వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. భారత్ కంటే 326 పరుగులతో వెనుకబడిన సౌతాఫ్రికా… ఫాలో ఆన్ ఆడుతూ…ఆదివారం తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.

Tags:    
Advertisement

Similar News