ఇసుక లొల్లి.... టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జిల్లాలో పాత పగలు చెలరేగాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల పాటు నిరవధిక దీక్షకు దిగడంతో కృష్ణా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేశారు. మరికొందరు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇసుక కొరతను నిరసిస్తూ కొల్లు రవీంద్ర దీక్షకు దిగుతానని ప్రకటించారు. కొల్లు రవీంద్ర దీక్షకు వ్యతిరేకంగా […]

Advertisement
Update:2019-10-11 06:58 IST

మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జిల్లాలో పాత పగలు చెలరేగాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల పాటు నిరవధిక దీక్షకు దిగడంతో కృష్ణా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేశారు. మరికొందరు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

ఇసుక కొరతను నిరసిస్తూ కొల్లు రవీంద్ర దీక్షకు దిగుతానని ప్రకటించారు. కొల్లు రవీంద్ర దీక్షకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు కూడా ధర్నాకు పిలుపునిచ్చారు.

ఈ తరుణంలో రెండు పార్టీల ఆందోళనలతో మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేశారు. టీడీపీ ఆందోళనకు శ్రీకారం చుట్టడం.. వైసీపీ కూడా కౌంటర్ గా ధర్నాకు దిగడంతో ఇప్పుడు కృష్ణా జిల్లా అట్టుడుకుతోంది.

Tags:    
Advertisement

Similar News