బార్ల వైపు మందుబాబులు పరుగులు

ఏపీలో నూతన మద్యం పాలసీ మంచి ఫలితాలనే ఇస్తున్నా ఇతర కారణాలు ఇబ్బందిగా మారాయి. పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత కొన్నిలోపాలు బయటపడుతున్నాయి. దీంతో వాటిని సరి చేసే పనిలో అధికారులున్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు, వినియోగానికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వమే మద్యం షాపుల నిర్వాహణ చేపట్టింది. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశారు. మద్యం షాపులను ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతున్నారు. మద్యం షాపుల వద్ద […]

Advertisement
Update:2019-10-11 00:37 IST

ఏపీలో నూతన మద్యం పాలసీ మంచి ఫలితాలనే ఇస్తున్నా ఇతర కారణాలు ఇబ్బందిగా మారాయి. పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత కొన్నిలోపాలు బయటపడుతున్నాయి. దీంతో వాటిని సరి చేసే పనిలో అధికారులున్నారు.

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు, వినియోగానికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వమే మద్యం షాపుల నిర్వాహణ చేపట్టింది. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశారు. మద్యం షాపులను ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతున్నారు. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూములను కూడా ఎత్తివేయడంతో షాపుల వద్ద మద్యం తాగుతూ రచ్చ చేసే దృశ్యాలు అదృశ్యం అయ్యాయి.

ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని బార్లు క్యాష్ చేసుకుంటున్నాయి. మద్యం షాపులు ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతుండడం, పైగా అక్కడ పర్మిట్ రూంలు లేకపోవడంతో మందుబాబులు బార్ల మీద పడుతున్నారు.

బార్లను ఉదయం 10కే తెరిచి రాత్రి 11 వరకు ఉంచుతున్నారు. ఫుడ్ సప్లయ్ పేరుతో మరో గంట అదనంగా బార్లు బార్లా తెరిచి ఉంచుతున్నారు. కొత్త పాలసీ వచ్చిన తర్వాత బార్లకు ఆదాయం అమాంతం పెరిగింది. కొన్ని బార్లు, రెస్టారెంట్లు హౌజ్‌ఫుల్‌గా నడుస్తున్నాయి.

మద్యం షాపుల సమయం కుదరింపు బార్లకు వరంగా మారిన అంశం తమ దృష్టికి వచ్చిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ పరిస్థితిని కూడా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. బార్ల సమయాన్ని కూడా మద్యం షాపులతో సమంగా కుదిస్తే లెక్క సరిపోతుందని… త్వరలోనే ఆ దిశగా నిర్ణయాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News