టీ-20 మహిళా సిరీస్ విజేత భారత్

సౌతాఫ్రికాపై 3-1తో నెగ్గిన భారత్ వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో జరిగిన ఆరుమ్యాచ్ ల సిరీస్ ను…హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు 3-1తో గెలుచుకొంది. అయితే…సిరీస్ లోని ఆఖరి టీ-20 మ్యాచ్ లో భారత్ అతిపెద్ద ఓటమి చవిచూసింది. సూరత్ వేదికగా జరిగిన ఈ సిరీస్ లోని మొదటి ఐదుమ్యాచ్ ల్లో భారత్ మూడు విజయాలు సాధించగా…మిగిలిన రెండుమ్యాచ్ లు వానదెబ్బతో రద్దయ్యాయి. సిరీస్ లోని ఆఖరి, 6వ […]

Advertisement
Update:2019-10-06 03:10 IST
  • సౌతాఫ్రికాపై 3-1తో నెగ్గిన భారత్

వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో జరిగిన ఆరుమ్యాచ్ ల సిరీస్ ను…హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు 3-1తో గెలుచుకొంది. అయితే…సిరీస్ లోని ఆఖరి టీ-20 మ్యాచ్ లో భారత్ అతిపెద్ద ఓటమి చవిచూసింది.

సూరత్ వేదికగా జరిగిన ఈ సిరీస్ లోని మొదటి ఐదుమ్యాచ్ ల్లో భారత్ మూడు విజయాలు సాధించగా…మిగిలిన రెండుమ్యాచ్ లు వానదెబ్బతో రద్దయ్యాయి.

సిరీస్ లోని ఆఖరి, 6వ మ్యాచ్ లో సౌతాఫ్రికా 105 పరుగుల భారీతేడాతో భారత్ ను చిత్తు చేసింది.

ఏమాత్రం ప్రాధాన్యంలేని ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగుల భారీస్కోరు సాధించింది.

ఓపెనర్లు లీ-లుస్ మొదటివికెట్ కు 16 ఓవర్లలో 144 పరుగుల భారీ భాగస్వామ్యంతో చెలరేగిపోయారు.

లీ 47 బాల్స్ లో 15 బౌండ్రీలు, ఒక సిక్సర్ తో 84 పరుగులు, కెప్టెన్ లుస్ 56 బాల్స్ లో 7 బౌండ్రీలతో 62 పరుగులు సాధించారు. దీంతో సఫారీ టీమ్ 3 వికెట్లకు 175 పరుగుల స్కోరు సాధించింది.

భారత బౌలర్లలో పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి,హర్మన్ ప్రీత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు.

భారత్ టపటపా…

176 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ 17.3 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. భారత టాపార్డర్ ప్లేయర్లు షెఫాలీ 4, మంధానా 5, జెమీమా 0,హర్మన్ ప్రీత్ 1, దీప్తి శర్మ 2 పరుగులకు అవుటయ్యారు.

ఒకదశలో 13 పరుగులకే ఆరు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన భారత్ ను మిడిలార్డర్ ప్లేయర్లు వేద కృష్ణమూర్తి, అరుంధతి రెడ్డి కొంత మేరకు ఆదుకొన్నా.. ఘోరపరాజయాన్ని తప్పించలేకపోయారు.

వేద 26, అరుంధతి 22 పరుగుల స్కోర్లకు వెనుదిరిగారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్లెర్క్ 3 వికెట్లు,ఇస్మాయిల్,బాశ్చ్ చెరోరెండు వికెట్లు పడగొట్టారు. భారత్ 105 పరుగుల తేడాతో చిత్తుగా ఓడినా 3-1తో సిరీస్ మాత్రం సొంతం చేసుకోగలిగింది.

సౌతాఫ్రికా ఓపెనర్ లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, భారత స్పిన్నర్ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. టీ-20 క్రికెట్లో భారత మహిళాజట్టు పొందిన అతిభారీ ఓటమి ఇదే కావటం విశేషం.

Tags:    
Advertisement

Similar News