దంతాలకు... గుండె పోటుకు సంబంధం ఉందట!

దంతాలు ఊడిపోవడానికి గుండె జబ్బులకు సంబంధం ఉన్నదని పరిశోధకులు అంటున్నారు. బాధాకరమైన కారణాల వల్ల దంతాలు కోల్పోయిన వయోజనులకు హృదయ సంబంధ వ్యాధులు (సివిడి) వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. “ఒక వ్యక్తి దంతాలు ఊడిపోతే, అతడికి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వైద్యులు ఈ వయసు లో ఉన్నవారికి దంతాల నష్టానికి దారితీసే వ్యాధులను నివారించడానికి తగిన నోటి ఆరోగ్య సంరక్షణ చర్యలను సిఫారసు చేయాలి. ఇలా చేస్తే భవిష్యత్తులో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని […]

Advertisement
Update:2019-10-05 07:10 IST

దంతాలు ఊడిపోవడానికి గుండె జబ్బులకు సంబంధం ఉన్నదని పరిశోధకులు అంటున్నారు. బాధాకరమైన కారణాల వల్ల దంతాలు కోల్పోయిన వయోజనులకు హృదయ సంబంధ వ్యాధులు (సివిడి) వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

“ఒక వ్యక్తి దంతాలు ఊడిపోతే, అతడికి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వైద్యులు ఈ వయసు లో ఉన్నవారికి దంతాల నష్టానికి దారితీసే వ్యాధులను నివారించడానికి తగిన నోటి ఆరోగ్య సంరక్షణ చర్యలను సిఫారసు చేయాలి. ఇలా చేస్తే భవిష్యత్తులో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది” అని ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ సౌద్ ఇస్లామిక్ విశ్వవిద్యాలయంలొ అధ్యయనం చేస్తున్న హమద్ మొహమ్మద్ కభా చెప్పారు.

నోటి వ్యాధులు-హృదయ సంబంధ వ్యాధుల మధ్య ఉండే సంబంధం ఇప్పటికీ బాగా తెలియదు. కాబట్టి ఈ అధ్యయనంలో పరిశోధకులు 2014 బిహేవియర్ రిస్క్ ఫాక్టర్ సర్విలెన్స్ వ్యవస్థ పై చేసిన సెకండరి ఎనాలిసిస్ ని పరిశీలించారు.

ఈ అధ్యయనంలో అమెరికాకి చెందిన 40-79 సంవత్సరాల మధ్య వయస్కులు… 3,16,588 మంది పాల్గొన్నారు.
మొత్తం మీద చూసినప్పుడు ట్రామాకి లోనైన కారణం గా దంతాలు ఊడిపోయే పెద్దవాళ్లలో గుండె జబ్బులు ఎక్కువగా కనిపించాయి.

ఈ అధ్యయన ఫలితాలను దుబాయ్‌లో జరుగుతున్న ‘ఎసిసి మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ 2019’ లో చర్చిస్తామని హమద్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News