జనసేనకు మిగిలిన "ఆకు"ల గుడ్‌బై

జనసేనకు వరుసగా కీలక నేతలు గుడ్‌బై చెబుతున్నారు. ఉన్న కొద్దిపాటి నేతలు కూడా పార్టీపై నమ్మకాన్ని కోల్పోయి కొత్త దారులు చూసుకుంటున్నారు. కనీసం గోదావరి జిల్లాల్లోనైనా జనసేన సత్తా చాటుతుందని భావించి ఆ పార్టీలో చేరిన నేతలు బయటకు వచేస్తున్నారు. పోటీ చేసిన రెండు చోట్లా అధినేతే భారీ ఓట్లతో ఓడిపోవడం, మొత్తం పార్టీ ఓటింగ్‌ శాతం కూడా ఐదారు శాతానికి పరిమితం అవడంతో ఇక లాభం లేదని నేతలు నిర్ధారణకు వచ్చారు. బియాండ్‌ ద లైన్‌ […]

Advertisement
Update:2019-10-05 01:50 IST

జనసేనకు వరుసగా కీలక నేతలు గుడ్‌బై చెబుతున్నారు. ఉన్న కొద్దిపాటి నేతలు కూడా పార్టీపై నమ్మకాన్ని కోల్పోయి కొత్త దారులు చూసుకుంటున్నారు. కనీసం గోదావరి జిల్లాల్లోనైనా జనసేన సత్తా చాటుతుందని భావించి ఆ పార్టీలో చేరిన నేతలు బయటకు వచేస్తున్నారు.

పోటీ చేసిన రెండు చోట్లా అధినేతే భారీ ఓట్లతో ఓడిపోవడం, మొత్తం పార్టీ ఓటింగ్‌ శాతం కూడా ఐదారు శాతానికి పరిమితం అవడంతో ఇక లాభం లేదని నేతలు నిర్ధారణకు వచ్చారు. బియాండ్‌ ద లైన్‌ ప్రయోజనాలు ఉన్న వారు మినహా సాధారణ రాజకీయ నాయకులు జనసేనలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

తాజాగా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను శనివారం పార్టీ అధిష్టానానికి పంపించారు. 2014 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి బీజేపీ తరపున ఆకుల గెలుపొందారు. ఎన్నికల సమయంలో జనసేనలో చేరారు. రాజమండ్రి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.

జనసేనతో లాభం లేదని నిర్ధారణకు వచ్చిన కాపు సామాజికవర్గానికి చెందిన ఆకుల సత్యనారాయణ తిరిగి బీజేపీలో చేరుతారని కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది. కానీ జనసేనకు రాజీనామా సమర్పించిన ఆకుల సత్యనారాయణ… వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు కూడా జరిగినట్టు చెబుతున్నారు. దసరాకు ముందే ఆయన వైసీపీలో చేరవచ్చని సమాచారం.

Tags:    
Advertisement

Similar News