ఫాదర్‌ ఆఫ్‌ గ్రామ సచివాలయం చంద్రబాబేనట...

గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్నది ఎవరు అంటే టక్కున గాంధీ పేరు చెబుతాం. టీడీపీ నేతల తీరు చూస్తుంటే కొద్దిరోజులు ఆగి గ్రామ స్వరాజ్యం ఆలోచనకు పురుడుపోసిందే మా చంద్రబాబు అనేలా ఉన్నారు. ఇప్పటికే ఆ దిశగా డైలాగులు మొదలయ్యాయి. ఇసుక నుంచైనా తన మాటలతో తైలం తీసే సామర్ధ్యం ఉన్న టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్‌ ఇప్పుడు గ్రామ సచివాలయాలకు తనదైన శైలిలో చంద్రబాబును పితామహుడిని చేస్తున్నారు. ఫాదర్‌ ఆఫ్ గ్రామ సచివాలయం చంద్రబాబే […]

Advertisement
Update:2019-10-02 06:05 IST

గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్నది ఎవరు అంటే టక్కున గాంధీ పేరు చెబుతాం. టీడీపీ నేతల తీరు చూస్తుంటే కొద్దిరోజులు ఆగి గ్రామ స్వరాజ్యం ఆలోచనకు పురుడుపోసిందే మా చంద్రబాబు అనేలా ఉన్నారు. ఇప్పటికే ఆ దిశగా డైలాగులు మొదలయ్యాయి.

ఇసుక నుంచైనా తన మాటలతో తైలం తీసే సామర్ధ్యం ఉన్న టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్‌ ఇప్పుడు గ్రామ సచివాలయాలకు తనదైన శైలిలో చంద్రబాబును పితామహుడిని చేస్తున్నారు. ఫాదర్‌ ఆఫ్ గ్రామ సచివాలయం చంద్రబాబే అంటున్నారు.

ఏపీలో జగన్‌ మోహన్ రెడ్డి తీసుకొస్తున్న గ్రామ సచివాలయం కాన్సెప్ట్ మంచి పేరు తెచ్చుకుంటుండడంతో బాబు రాజేంద్రప్రసాద్… గ్రామ సచివాలయం ఆలోచన చంద్రబాబుదేనని చెప్పారు. చంద్రబాబు ఆలోచనను జగన్ మోహన్ రెడ్డి కాపీ కొట్టారని ఆరోపించారు.

2000 సంవత్సరంలోనే చంద్రబాబు గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. మరి ఎక్కడ ఉన్నాయి బాబు గారి సచివాలయాలు అన్న అనుమానానికి కూడా సమాధానం చెప్పేశారు రాజేంద్రప్రసాద్. అలా చంద్రబాబు తెచ్చిన గ్రామ సచివాలయాన్ని వైఎస్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేశారని చెప్పారు.

మరి అప్పుడెప్పుడో చంద్రబాబు గుట్టుగా గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, … దాన్ని వైఎస్‌ రద్దు చేయడం జరిగి ఉంటే… తిరిగి గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు గ్రామ సచివాలయాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు?.

బహుశా 2014 తర్వాత గ్రామ సచివాలయాలను తాను ఏర్పాటు చేస్తే 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిపోయి వాటిని రద్దు చేస్తారన్న భయంతో చంద్రబాబు ఐదేళ్లలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయలేదు కాబోలు.

Tags:    
Advertisement

Similar News