ప్రో-కబడ్డీ లీగ్ సెమీస్ లో దబాంగ్ ఢిల్లీ

పూనేరీ పల్టాన్ పై ఢిల్లీ 60-40తో గెలుపు నవీన్ కుమార్ వరుసగా 17వ సూపర్-10 ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్ సెమీఫైనల్స్ చేరిన తొలిజట్టుగా దబాంగ్ ఢిల్లీ నిలిచింది. పంచకులాలోని తావు దేవీలాల్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి అంచె లీగ్ పోటీలో దబాంగ్ ఢిల్లీ 60- 40 పాయింట్ల తేడాతో పూనేరీ పల్టాన్ ను చిత్తు చేసింది. ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ ప్రస్తుత సీజన్లో వరుసగా 17వ సూపర్ -10 స్కోరు సాధించడం విశేషం. అంతేకాదు… […]

Advertisement
Update:2019-10-01 01:15 IST
  • పూనేరీ పల్టాన్ పై ఢిల్లీ 60-40తో గెలుపు
  • నవీన్ కుమార్ వరుసగా 17వ సూపర్-10

ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్ సెమీఫైనల్స్ చేరిన తొలిజట్టుగా దబాంగ్ ఢిల్లీ నిలిచింది. పంచకులాలోని తావు దేవీలాల్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి అంచె లీగ్ పోటీలో దబాంగ్ ఢిల్లీ 60- 40 పాయింట్ల తేడాతో పూనేరీ పల్టాన్ ను చిత్తు చేసింది.

ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ ప్రస్తుత సీజన్లో వరుసగా 17వ సూపర్ -10 స్కోరు సాధించడం విశేషం. అంతేకాదు… పూణే జట్టును ఏడుసార్లు ఆలౌట్ చేయడంలో ఢిల్లీ జట్టు సఫలమయ్యింది.

ప్రస్తుత సీజన్లో అత్యంత వేగంగా 400 రైడింగ్ పాయింట్లు సాధించిన తొలి ప్లేయర్ ఘనతను నవీన్ కుమార్ దక్కించుకొన్నాడు. డిఫెన్స్ లో ఢిల్లీ స్టార్ డిఫెండర్ రవీంద్ర పహాల్ 50 టాకిల్ పాయింట్ల రికార్డును సాధించడం విశేషం.

ప్లే-ఆఫ్ రౌండ్లో హర్యానా స్టీలర్స్…

మరో కీలక పోటీలో ఆతిథ్య హర్యానా స్టీలర్స్ 38-37 పాయింట్ల తేడాతో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ ను అధిగమించడం ద్వారా ప్లే ఆఫ్ రౌండ్లో చోటు ఖాయం చేసుకోగలిగింది.

హర్యానా విజయంలో స్టార్ ప్లేయర్ వికాస్ ఖండోలా ప్రధానపాత్ర వహించాడు. ఆఖరి నిముషం వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరును…హర్యానా ..బ్లాకింగ్ పాయింట్ ద్వారా ముగించింది.

Tags:    
Advertisement

Similar News