ప్రపంచ బాక్సింగ్ ఏడో స్వర్ణానికి మేరీకోమ్ గురి

9వసారి ప్రపంచ బాక్సింగ్ బరిలో మేరీకోమ్ భారత మహిళా బాక్సింగ్ ఎవర్ గ్రీన్ స్టార్ మేరీ కోమ్… తన కెరియర్ లో తొమ్మిదోసారి ప్రపంచ బాక్సింగ్ బరిలోకి దిగుతోంది. రికార్డుస్థాయిలో ఏడో బంగారు పతకానికి గురి పెట్టింది. రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా అక్టోబర్ 3 నుంచి 13 వరకూ జరిగే 2019 ప్రపంచ మహిళా బాక్సింగ్ సమరానికి ముగ్గురు బిడ్డల తల్లిగా, 37 సంవత్సరాల వయసులో మేరీ కోమ్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. ఇప్పటికే ప్రపంచ బాక్సింగ్ లో ఆరు […]

Advertisement
Update:2019-10-01 08:30 IST
  • 9వసారి ప్రపంచ బాక్సింగ్ బరిలో మేరీకోమ్

భారత మహిళా బాక్సింగ్ ఎవర్ గ్రీన్ స్టార్ మేరీ కోమ్… తన కెరియర్ లో తొమ్మిదోసారి ప్రపంచ బాక్సింగ్ బరిలోకి దిగుతోంది. రికార్డుస్థాయిలో ఏడో బంగారు పతకానికి గురి పెట్టింది.

రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా అక్టోబర్ 3 నుంచి 13 వరకూ జరిగే 2019 ప్రపంచ మహిళా బాక్సింగ్ సమరానికి ముగ్గురు బిడ్డల తల్లిగా, 37 సంవత్సరాల వయసులో మేరీ కోమ్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది.

ఇప్పటికే ప్రపంచ బాక్సింగ్ లో ఆరు స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించిన తనపైన భారీ అంచనాలు ఉండడంతో తొలిసారిగా ఒత్తిడికి గురవుతున్నట్లు వెటరన్ మేరీకోమ్ ప్రకటించింది.

గత ప్రపంచ కప్ 48 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించిన మేరీకోమ్…ప్రస్తుత ప్రపంచకప్ లో మాత్రం 51 కిలోల విభాగంలో తన అదృష్టం పరీక్షించుకోనుంది.

వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ లో సైతం మేరీ కోమ్ 51 కిలోల విభాగంలోనే పోటీపడనుంది.

8 ప్రపంచ కప్ లు…6 స్వర్ణాలు….

మేరీ కోమ్ తన సుదీర్ఘ కెరియర్ లో ఇప్పటి వరకూ పాల్గొన్న ఎనిమిది ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నీలలో ఆరు స్వర్ణపతకాలు, ఓ రజత పతకం సాధించడం ద్వారా.. అత్యంత విజయవంతమైన మహిళా బాక్సర్ గా చరిత్ర సృష్టించింది.

2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం మాత్రమే సాధించిన మేరీ కోమ్ కు 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన రికార్డు ఉంది.

2012, 2016 ప్రపంచకప్ టోర్నీల 51 కిలోల విభాగంలో పోటీకి దిగిన మేరీకోమ్…క్వార్టర్ ఫైనల్స్ లోనే పరాజయాలు పొందడం విశేషం.

ప్రస్తుత ప్రపంచకప్ లో సైతం 51 కిలోల విభాగంలోనే మేరీకోమ్ పోటీకి దిగనుండడంతో… ఏదో ఒక పతకం సాధించడం ఏమంత తేలికకాబోదు.

2019 ఇండియన్ ఓపెన్, ఇండోనీసియా వేదికగా ముగిసిన ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలలో స్వర్ణ పతకాలు నెగ్గిన మేరీకోమ్… ప్రపంచకప్ కు సన్నాహాల కోసం.. ఆసియా బాక్సింగ్ పోటీలకు దూరమయ్యింది.

ఇటలీలో ప్రత్యేకశిక్షణ ద్వారా ప్రపంచకప్ కు పూర్తిస్థాయిలో సిద్ధమైన మేరీకోమ్…51 కిలోల విభాగంలో నెగ్గుకురాగలదా?…

Tags:    
Advertisement

Similar News