మద్యం ముట్టుకుంటే షాక్... చెప్పినట్టే చేసిన జగన్
ఏపీలో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తోంది. ఇకపై ప్రైవేట్ మద్యం అమ్మకాలు ఉండవు. ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా 3500 మద్యం షాపులను ఏర్పాటు చేసింది. వాటి ద్వారానే లిక్కర్ అమ్మకాలు సాగుతాయి. గతంలో ఉన్న షాపులను 20 శాతం మేర తగ్గించింది ప్రభుత్వం. ఇది వరకులా మద్యం కొని షాపు వద్దే తాగేందుకు వీలు లేదు. మద్యం షాపుల వద్ద సిట్టింగ్ వేసేందుకు చాన్స్ లేదు. మద్యం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి […]
ఏపీలో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తోంది. ఇకపై ప్రైవేట్ మద్యం అమ్మకాలు ఉండవు. ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా 3500 మద్యం షాపులను ఏర్పాటు చేసింది. వాటి ద్వారానే లిక్కర్ అమ్మకాలు సాగుతాయి. గతంలో ఉన్న షాపులను 20 శాతం మేర తగ్గించింది ప్రభుత్వం.
ఇది వరకులా మద్యం కొని షాపు వద్దే తాగేందుకు వీలు లేదు. మద్యం షాపుల వద్ద సిట్టింగ్ వేసేందుకు చాన్స్ లేదు. మద్యం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. లూజ్ విక్రయించరు. మద్యం సీసాలు ఒక్కొక్క వ్యక్తికి మూడు మాత్రమే విక్రయిస్తారు.
మద్యం విక్రయాల సమయాన్ని మరింతగా కుదించారు. గతంలో రాత్రి 10 వరకు మద్యం షాపులు తెరిచి ఉండేవి. ఇప్పుడు ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయిస్తారు. కొత్త ప్రభుత్వం తొలుత ఈ కుదింపును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకుగా నిర్ణయించింది. దాన్ని మరింత కుదించి ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలని నిర్ణయించారు.
బార్ల సమయాలను కూడా కుదించబోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 800 బార్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటిని ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంచుతున్నారు. ఫుడ్ సర్వింగ్ పేరుతో మరో గంట తెరిచి ఉంచుతున్నారు. బార్ల సమయాల కుదింపుపై నేడు ప్రభుత్వం ప్రకటన చేయనుంది.
మరోవైపు మద్యం వాడకాన్ని నిరుత్సాహపరిచేలా మద్యం ధరలను పెంచుతామని పాదయాత్ర సమయంలోనే చెప్పిన జగన్ అన్నట్టుగానే మద్యం ధరలను భారీగా పెంచేశారు.
90 ఎంఎల్ మద్యం బాటిల్ ధరను 10 రూపాయలు పెంచారు. 180 ఎంఎల్ బాటిల్ ధరను 20 రూపాయలు పెంచారు. 370 ఎంఎల్ బాటిల్‌పై 40 రూపాయలు, 750 ఎంఎల్ బాటిల్ ధరను 80 రూపాయలు, 1000 ఎంఎల్ బాటిల్ ధరను 100 రూపాయలు, 2000 బాటిల్ ధరను 250 రూపాయలు పెంచారు.
ఫారిన్ లిక్కర్ ధరలను కూడా భారీగా పెంచారు. 60ఎంఎల్‌పై 10 రూపాయలు, 275 ఎంఎల్ బాటిల్‌పై 20 రూపాయలు , 500 ఎంఎల్ బాటిల్ ధరను 40 రూపాయలు, 2000 ఎంఎల్ బాటిల్ ధరను 250 రూపాయలు పెంచారు.
బీర్ ధరలనూ పెంచారు. 300ఎంఎల్ బాటిల్ బీరుపై రూ. 10, … 500 ఎంఎల్ బీరు బాటిల్‌పై రూ. 10 , …. 650ఎంఎల్ బాటిల్‌పై రూ.20, …. 3000 ఎంఎల్‌పై రూ. 1000, … 5000ఎంఎల్ బీరుపై రూ. 2000 పెంచారు. బ్రీజర్ ధర 275ఎంఎల్‌పై రూ. 20 పెంచారు.