రేప్ కు గురైన అమ్మాయికి రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ

స్వామి చిన్మయానంద్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన న్యాయశాస్త్ర విద్యార్థినికి మద్దతుగా తమ పార్టీ చేస్తున్న పాదయాత్రను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ఆరోపించారు. షాజహాన్‌పూర్‌ జిల్లా సరిహద్దులను అన్ని వైపుల నుంచి మూసివేసి, జితిన్ ప్రసాద వంటి కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పేర్కొంది. “యుపిలోని నేరస్థులకు ప్రభుత్వ రక్షణ ఉంది, అందువల్ల వారు అత్యాచార బాధితురాలిని బెదిరించగలరు” అని ప్రియాంక […]

Advertisement
Update:2019-09-30 11:27 IST

స్వామి చిన్మయానంద్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన న్యాయశాస్త్ర విద్యార్థినికి మద్దతుగా తమ పార్టీ చేస్తున్న పాదయాత్రను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ఆరోపించారు.

షాజహాన్‌పూర్‌ జిల్లా సరిహద్దులను అన్ని వైపుల నుంచి మూసివేసి, జితిన్ ప్రసాద వంటి కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పేర్కొంది.

“యుపిలోని నేరస్థులకు ప్రభుత్వ రక్షణ ఉంది, అందువల్ల వారు అత్యాచార బాధితురాలిని బెదిరించగలరు” అని ప్రియాంక గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

“యుపి బిజెపి ప్రభుత్వం షాజహాన్‌పూర్‌ కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతున్న గొంతులను అణచివేయాలని కోరుకుంటున్నది. అందుకే పాదయాత్రను అడ్డుకుని మా కార్యకర్తలు, నాయకులను అరెస్టు చేస్తున్నారు. ఇంకా భయపడటానికి ఏమున్నది?” అంటూ తూర్పు ఉత్తరప్రదేశ్ ఇంచార్జిగా ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అన్నారు.

బుధవారం లా స్టూడెంట్ ని అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆమె బయిల్ పిటిషన్ ని తిరస్కరించారు.

స్వామి చిన్మయానంద్‌పై అత్యాచారం కంటే తక్కువ శిక్ష పడే అభియోగంపై భారత శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 376 సి కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన తరువాత జ్యుడీషియల్ కస్టడీకి పంపడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News