అక్టోబర్ 5 నుంచి తెలంగాణలో ఆర్టీసీ సమ్మె
దసరా పండుగ ఈసారి తెలంగాణ ప్రభుత్వానికి చేదు మిగిల్చేలా ఉంది. తెలంగాణ అధికారిక పండుగ దసరాకు రెండు రోజుల ముందు అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తామంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు. సమ్మెకు ప్రధాన కారణం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడమేనని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే […]
దసరా పండుగ ఈసారి తెలంగాణ ప్రభుత్వానికి చేదు మిగిల్చేలా ఉంది. తెలంగాణ అధికారిక పండుగ దసరాకు రెండు రోజుల ముందు అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తామంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు.
సమ్మెకు ప్రధాన కారణం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడమేనని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఏపీ సీఎం ఆర్టీసీపై త్వరితగతిన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో మాత్రం తెలంగాణ రాష్ట్ర్ర సమితి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్నా అర్టీసీ విలీనం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో సరిగ్గా దసరా పండుగ సమయంలోనే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలని తీర్మానించుకుని… సమ్మె నోటీస్ ఇచ్చినట్లు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు డిమాండ్లతో పాటు మోటార్ వెహికల్ పన్నును రద్దు చేయడం, సంస్థకు పట్టణాల్లో వస్తున్న నష్టాలను ప్రభుత్వమే భరించాలని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు ఆర్టీసీ కార్మికులు.
ఆర్టీసీ విలీనంపై సెప్టెంబర్ 3వ తేదీనే కార్మిక సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోగా కనీసం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.