బక్కచిక్కిన ఫలితం... గదిని కోల్పోయిన టీడీపీ

పార్లమెంట్‌ ప్రాంగణంలో టీడీపీ గదిని కోల్పోయింది. ఆ గదిని వైసీపీ సొంతం చేసుకుంది. 1989 నుంచి టీడీపీ… పార్లమెంట్ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని 5వ నెంబర్‌ గదిలో ఉంటూ వస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ గదిని టీడీపీ ఖాళీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ బక్కచిక్కి ఆ పార్టీ ఎంపీల సంఖ్య మూడుకు పడిపోవడం, రాజ్యసభ సభ్యులు కూడా ఇద్దరే మిగిలిన నేపథ్యంలో అంతపెద్ద గది టీడీపీకి అవసరం లేదని స్పీకర్ భావించారు. దాన్ని […]

Advertisement
Update:2019-09-27 03:02 IST
బక్కచిక్కిన ఫలితం... గదిని కోల్పోయిన టీడీపీ
  • whatsapp icon

పార్లమెంట్‌ ప్రాంగణంలో టీడీపీ గదిని కోల్పోయింది. ఆ గదిని వైసీపీ సొంతం చేసుకుంది. 1989 నుంచి టీడీపీ… పార్లమెంట్ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని 5వ నెంబర్‌ గదిలో ఉంటూ వస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ గదిని టీడీపీ ఖాళీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

టీడీపీ బక్కచిక్కి ఆ పార్టీ ఎంపీల సంఖ్య మూడుకు పడిపోవడం, రాజ్యసభ సభ్యులు కూడా ఇద్దరే మిగిలిన నేపథ్యంలో అంతపెద్ద గది టీడీపీకి అవసరం లేదని స్పీకర్ భావించారు. దాన్ని తక్షణం ఖాళీ చేయాలని టీడీపీని ఆదేశించారు. ఇప్పటి వరకు టీడీపీకి కేటాయించిన గదిని వైసీపీకి కేటాయించారు.

వైసీపీ నుంచి లోక్‌సభ ఎంపీలు 22 మంది, రాజ్యసభ ఎంపీలు ఇద్దరు ఉండడంతో పెద్ద గది ఉండాలన్న ఉద్దేశంతో ఐదో నెంబర్‌ గదిని కేటాయించారు. ఈ గది కోసం డీఏంకే కూడా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఆ గదిని వైసీపీకే కేటాయించారు స్పీకర్.

గతంలోనూ పలుమార్లు ఈ గదిని టీడీపీ ఖాళీ చేయాల్సిన పరిస్థితులు వచ్చినా… టీడీపీ ఎంపీలు లాబీయింగ్ చేసి ఆ గదిని తమ వద్దే అట్టిపెట్టుకున్నారు. కానీ మూడు దశాబ్దాల తర్వాత గదిని ఖాళీ చేయక తప్పడం లేదు.

Tags:    
Advertisement

Similar News