గుజరాత్‌లో కూలిన హెలికాప్టర్..ముగ్గురు మృతి
గుజరాత్ పొర్ బందర్ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలి ముగ్గురు మృతి చెందారు.
గుజరాత్ పొర్ బందర్ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలి ముగ్గురు మృతి చెందారు. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ధ్రువ్ హెలికాప్టర్ సాధారణ గస్తీ కోసం బయలుదేరింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోర్‌బందర్ సమీపంలోని గ్రౌండ్‌లో అది కూలిపోయింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ హెలికాఫ్టర్ ప్రయాణం మొదలుపెట్టాక సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే అది కూలిపోయింది. దీనిపై కోస్టు గార్డు ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.
ఇప్పటికే ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లలో కీలకమైన రక్షణ చర్యలకు హిందూస్థాన్ ఏరోనాటికల్ సంస్థ ఇప్పటికే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ కూలడానికి కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు హెలికాప్టర్ కూలిన తర్వాత మంటలు చెలరేగిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గతేడాది కూడా ఈ శ్రేణి హెలికాఫ్టర్లు ప్రమాదాలకు గురయ్యాయి. వీటిల్లో డిజైన్ సమస్యలు ఉండటంతో చాలా చోట్ల వీటిని వాడటంలేదు. గతేడాది మార్చి 8న మన నౌకాదళానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది.