వేణుమాధవ్ కన్నుమూత

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ కొద్దికాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వేణుమాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లులున్నారు. 600పైగా చిత్రాల్లో వేణుమాధవ్‌ నటించారు. లక్ష్మీ సినిమాలో నటనకు గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు దక్కింది. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా […]

Advertisement
Update:2019-09-25 09:22 IST

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ కొద్దికాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వేణుమాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లులున్నారు. 600పైగా చిత్రాల్లో వేణుమాధవ్‌ నటించారు. లక్ష్మీ సినిమాలో నటనకు గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు దక్కింది.

మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కేరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత వెండితెరకు పరిచయం అయ్యారు. వేణుమాధవ్‌ను వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సంప్రదాయం చిత్రం ద్వారా వేణుమాధవ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. 39 ఏళ్ల వేణుమాధవ్ స్వస్థలం సూర్యపేట జిల్లా కోదాడ.

వేణుమాధవ్‌ ఆరోగ్యంపై గతంలోనే పలుమార్లు వార్తలొచ్చాయి. కొన్ని చానళ్లు వేణుమాధవ్ చనిపోయాడంటూ గతంలో కథనాలు ప్రసారం చేశాయి. వాటిని పలుమార్లు వేణుమాధవ్ ఖండించారు.

కొన్నేళ్లుగా చిత్రపరిశ్రమలోనూ వేణుమాధవ్‌కు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించారు. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా కోదాడ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. కానీ దాన్ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

Tags:    
Advertisement

Similar News