'టీ' ఇలా తాగితే... క్యాన్సర్ వస్తుందట !

టీ వేడిగా ఉన్నప్పుడే తాగటానికి సాధారణం గా ఇష్టపడతారు ఎవరైనా. కొందరైతే మరీ వేడిగా ఉంటే కానీ తాగరు. ఇదిగో ఇట్లా తాగేవారికి అన్నవాహిక క్యాన్సర్ వస్తుందని… ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌’లో ప్రచురించిన ఒక పరిశోధనా వ్యాసం చెబుతున్నది. అధ్యయనం కోసం, ఇరాన్‌లోని గోలెస్టాన్‌లో 40 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు గల 50,045 మందిని సగటున 10.1 సంవత్సరాల వరకు పరిశోధకులు పరిశీలించారు. ఈ పరిశోధన 2004-2017 మధ్య జరిగింది. పరిశీలనకు సహకరించిన […]

Advertisement
Update:2019-09-25 03:05 IST

టీ వేడిగా ఉన్నప్పుడే తాగటానికి సాధారణం గా ఇష్టపడతారు ఎవరైనా. కొందరైతే మరీ వేడిగా ఉంటే కానీ తాగరు. ఇదిగో ఇట్లా తాగేవారికి అన్నవాహిక క్యాన్సర్ వస్తుందని… ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌’లో ప్రచురించిన ఒక పరిశోధనా వ్యాసం చెబుతున్నది.

అధ్యయనం కోసం, ఇరాన్‌లోని గోలెస్టాన్‌లో 40 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు గల 50,045 మందిని సగటున 10.1 సంవత్సరాల వరకు పరిశోధకులు పరిశీలించారు. ఈ పరిశోధన 2004-2017 మధ్య జరిగింది.

పరిశీలనకు సహకరించిన వారిని వారు తాగిన టీ ఉష్ణోగ్రతను బట్టి రెండు వర్గాలుగా విభజించారు – చాలా వేడిగా (60°సి, అంతకంటే ఎక్కువ), మోస్తరు (60°సి కంటే తక్కువ)వేడిగా. ప్రతిరోజూ 700 మి.లీ లేదా అంతకంటే ఎక్కువ ‘చాలా వేడి’ టీ తాగిన వారికి, 700 మి.లీ కంటే తక్కువ ‘గోరువెచ్చని’ టీ తాగేవారి కంటె, అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం 90 శాతం ఎక్కువ అని పరిశీలనలో తేలింది.

గొంతు నుండి పొట్ట వరకు ఉండే పొడవైన బోలు గొట్టంను అన్నవాహిక అంటాం. అన్నవాహిక అనేది గొంతు నుండి కడుపుకు ఆహారం / ద్రవం కదలికకు సహాయపడే అవయవం.

అన్నవాహిక క్యాన్సర్ సాధారణంగా అన్నవాహిక లోపలి భాగంలో ఉండే కణాలలో ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలకు ఇది కూడా ఒక కారణం అంటారు.

లక్షణాలు – బరువు తగ్గడం, ఛాతీ నొప్పి, మింగడంలో ఇబ్బంది, అజీర్ణం, గుండెల్లో మంట, దగ్గు, మొద్దుబారడం.

Tags:    
Advertisement

Similar News