ఎంఆర్ఐ మెషీన్ లోపల పేషెంట్ ని మరిచిపోయారా?

హర్యానా ఆసుపత్రిలో ఒక టెక్నీషియన్ ఒక రోగిని ఎంఆర్ఐ మెషీన్ లోపల నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఒక వృద్ధుడు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్‌ఐ) స్కాన్ కోసం చండీగర్ నగరంలోని సివిల్ ఆసుపత్రికి వెళ్లానని 60 ఏళ్ల వృద్ధుడు పంచకుల విలేకరులతో అన్నారు. ఫిర్యాదుదారుడి ప్రకారం… సాంకేతిక నిపుణుడు ఈ స్కాన్ ప్రక్రియకు 10-15 నిమిషాలు పట్టవచ్చని చెప్పాడు. కాని తనను యంత్రం నుండి బయటకు తీసుకెళ్లడం మర్చిపోయాడు. అయితే ఆసుపత్రి […]

Advertisement
Update:2019-09-24 06:02 IST

హర్యానా ఆసుపత్రిలో ఒక టెక్నీషియన్ ఒక రోగిని ఎంఆర్ఐ మెషీన్ లోపల నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఒక వృద్ధుడు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు.

మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్‌ఐ) స్కాన్ కోసం చండీగర్ నగరంలోని సివిల్ ఆసుపత్రికి వెళ్లానని 60 ఏళ్ల వృద్ధుడు పంచకుల విలేకరులతో అన్నారు. ఫిర్యాదుదారుడి ప్రకారం… సాంకేతిక నిపుణుడు ఈ స్కాన్ ప్రక్రియకు 10-15 నిమిషాలు పట్టవచ్చని చెప్పాడు. కాని తనను యంత్రం నుండి బయటకు తీసుకెళ్లడం మర్చిపోయాడు. అయితే ఆసుపత్రి ఈ ఆరోపణలను ఖండించింది.

“నేను ఊపిరి ఆడక తన్నుకులాడాను. కాని నన్ను బయటకు తీసుకెళ్లడానికి ఎవరూ అక్కడ లేరు” అని వృద్ధుడు చెప్పాడు. “చివరగా, అరగంటకు పైగా కష్టపడిన తరువాత, నేను ఏదో ఒకవిధంగా మెషిన్ బెల్ట్ తెంచుకుని బయటకు రాగలిగా”నని అతడు అన్నాడు.

పూర్తిగా వైద్య నిర్లక్ష్యాన్ని చూపిన వీరిపై చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసు ఫిర్యాదు చేశాడు. వాస్తవాన్ని తెలుసుకోవడానికి స్కాన్ జరిగిన ప్రాంతానికి చెందిన సిసిటివి ఫుటేజీని ఆసుపత్రి నుంచి తీసుకొని తనిఖీ చేయాలని అతడు కోరాడు.

అయితే, పేషెంట్ అబద్ధం చెబుతున్నాడని…టెక్నీషియన్ యంత్రం నుండి అతడిని బయటకు తీసినట్లు ఆసుపత్రి పేర్కొంది. తన స్కాన్ కు ఎక్కువ సమయం పడుతుందని చెప్పామని, కాని అతడు “భయపడ్డాడ”ని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి.

ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పంచకుల పోలీసు అధికారి తెలిపారు.

హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ విలేకరులతో మాట్లాడుతూ… మీడియా రిపోర్టుల ద్వారా ఈ సంఘటన గురించి తెలుసుకున్నానని, ఆరోగ్యం డైరెక్టర్ జనరల్ నుండి సమగ్ర నివేదికను కోరినట్లు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News