మన్మోహన్‌ సింగ్‌ మృతికి సీడబ్ల్యూసీ సంతాపం

ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ

Advertisement
Update:2024-12-27 18:26 IST

మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మృతికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. శుక్రవారం సాయంత్రం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో మన్మోహన్‌ మృతికి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆయన దేశానికి, కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలను పార్టీ ముఖ్య నాయకురాలు సోనియాగాంధీ గుర్తు చేశారు. దేశాన్ని ఆర్థికమంగా ముందుకు తీసుకెళ్లేందుకు మన్మోహన్‌ చేసిన సేవలను కొనియాడారు. ఆయన మరణం పార్టీకి, దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో కలిసి కట్టుగా పనిచేద్దామని ప్రతినబూనారు. సమావేశంలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌ సహా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News