మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం
నిగమ్ బోధ్ ఘాట్ లో అంత్యక్రియలపై కాంగ్రెస్ అసంతృప్తి
Advertisement
మాజీ ప్రధాని, సుప్రసిద్ధ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై రాజకీయ వివాదం నెలకొంది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు వీర్ భూమి లేదా శక్తిస్థల్ లోని కొంత స్థలంలో కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రియాంకాగాంధీ ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం వెల్లడించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నిగమ్ బోధ్ ఘాట్ లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మన్మోహన్ సింగ్ ను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అవమానిస్తోందని ప్రియాంకాగాంధీ అసహనం వ్యక్తం చేశారు.
Advertisement