మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి కేటీఆర్ నివాళులు
ఆయన సతీమణిని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు
Advertisement
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఢిల్లీలోని ఆయన నివాసంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం రాత్రి నివాళులర్పించారు. బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావుతో కలిసి మన్మోహన్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయన సతీమణి గురుశరణ్ కౌర్ ను పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన భారత్ ను బలమైన శక్తిగా నిలబెట్టడానికి మన్మోహన్ సింగ్ కృషి చేశారన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, ఆయన తెలంగాణకు మద్దతునిచ్చారని గుర్తు చేశారు.
Advertisement