అసలు సినిమా ఇప్పుడే మొదలైంది బాబు...
చంద్రబాబుకు అసలు సినిమా ఇప్పుడే మొదలైందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. పోలవరం ప్రాజెక్టులో దోచుకున్న సొమ్మును వెదజల్లి చంద్రబాబు ఎన్నికల్లో గెలవాలనుకున్నారని… కానీ ప్రజలు చంద్రబాబు ముఖం మీద ఉమ్మేశారన్నారు. పోలవరం పునాదుల నుంచీ జరిగిన అవినీతిపై సాక్ష్యాలతో సహా బయటకు వస్తుంటుంటే… ఎవరి కాళ్లు పట్టుకుని బయటపడాలా అని చంద్రబాబు వెతుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో పుష్కరాల్లో 27 మందిని పొట్టన పెట్టుకుని…. కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ చంద్రబాబు దబాయించారని… […]
చంద్రబాబుకు అసలు సినిమా ఇప్పుడే మొదలైందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. పోలవరం ప్రాజెక్టులో దోచుకున్న సొమ్మును వెదజల్లి చంద్రబాబు ఎన్నికల్లో గెలవాలనుకున్నారని… కానీ ప్రజలు చంద్రబాబు ముఖం మీద ఉమ్మేశారన్నారు.
పోలవరం పునాదుల నుంచీ జరిగిన అవినీతిపై సాక్ష్యాలతో సహా బయటకు వస్తుంటుంటే… ఎవరి కాళ్లు పట్టుకుని బయటపడాలా అని చంద్రబాబు వెతుకున్నారని ఎద్దేవా చేశారు.
టీడీపీ హయాంలో పుష్కరాల్లో 27 మందిని పొట్టన పెట్టుకుని…. కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ చంద్రబాబు దబాయించారని… కానీ బోటు ప్రమాదానికి ప్రైవేట్ వ్యక్తులు కారణమైనా సరే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నది అని చెప్పిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి…. అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. నాయకుడికి, ఈవెంట్ మేనేజర్‌కు ఉన్న తేడా ఇదే అంటూ వ్యాఖ్యానించారు.
రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ కమిషన్, అమ్మ ఒడి, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి సాహోసోపేతమైన నిర్ణయాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్నారన్నారు.
జగన్ పథకాలను ఇప్పుడు 15 రాష్ట్రాలు ఆధ్యయనం చేస్తున్నాయన్నారు. మొదటి సారి సీఎం అయిన 46 ఏళ్ల యువకుడు దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నారన్నారు.