విశాఖ బ్రాండ్ డ్యామేజ్‌కు ఒక సామాజికవర్గం ప్రయత్నం

విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని… ఇందుకు కొన్ని పత్రికలు సహకరిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ ఆరోపించారు. విశాఖలో జగన్‌ పేరు చెప్పి కొందరు దందాలు చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపించడంపై స్పందించిన అమర్‌నాథ్… విశాఖ నగర అభివృద్ధిని అడ్డుకునేందుకు ఈ తరహా ప్రచారం మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి అందులో విజయం సాధించారన్నారు. టీడీపీ హయాంలో విశాఖకు ఏలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఇప్పుడు జగన్‌ సీఎం […]

Advertisement
Update:2019-09-23 11:42 IST

విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని… ఇందుకు కొన్ని పత్రికలు సహకరిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ ఆరోపించారు. విశాఖలో జగన్‌ పేరు చెప్పి కొందరు దందాలు చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపించడంపై స్పందించిన అమర్‌నాథ్… విశాఖ నగర అభివృద్ధిని అడ్డుకునేందుకు ఈ తరహా ప్రచారం మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు.

2014 ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి అందులో విజయం సాధించారన్నారు. టీడీపీ హయాంలో విశాఖకు ఏలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఇప్పుడు జగన్‌ సీఎం అయిన తర్వాత విశాఖ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుంటే చూసి ఓర్వలేక… టీడీపీ, కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయన్నారు. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసేలా టీడీపీ, దాని అనుకూల పత్రికలు చేస్తున్న విషప్రచారానికి ఒక సామాజికవర్గం వారు కూడా సహకరిస్తున్నారని అమర్‌నాథ్ ఆరోపించారు.

వైసీపీ పేరు చెప్పుకుని ఎవరు దందాలు చేసినా సహించే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి కూడా జిల్లా అధికారులకు స్పష్టం చేశారన్నారు. తమ పార్టీపై తప్పుడు ఆరోపణల చేస్తున్న నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరుతామన్నారు.

విశాఖలో వేల ఎకరాల భూకుంభకోణానికి పాల్పడింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. విశాఖలో ఎకరం ఐదు కోట్ల విలువ చేసే భూమిని ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యానికి కేవలం రూ.50 లక్షలకే చంద్రబాబు కట్టబెట్టింది నిజం కాదా అని గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News