కరకట్టపై మొదలైన ఆక్రమణల కూల్చివేతలు

కృష్ణానది కరకట్ట వెంబడి బడాబాబులు అక్రమంగా నిర్మించుకున్న కట్టడాల కూల్చివేతను సీఆర్‌డీఏ మొదలుపెట్టింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని వ్యక్తులకు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇందులో భాగంగా పాతూరు కోటేశ్వర రావు అనే వ్యక్తికి చెందిన అక్రమ నిర్మాణాలను సీఆర్‌డీఏ సిబ్బంది కూల్చివేస్తున్నారు. నదిలోకి చొచ్చుకువచ్చి వీటిని నిర్మించుకున్నారు. కరకట్ట వెంబడి ఉన్న మరిన్ని నిర్మాణాలను కూల్చేయబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌ హౌజ్‌కు సీఆర్‌డీఏ నోటీసులు ఇచ్చింది. వారంలోగా నిర్మాణాన్ని తొలగించాలని […]

Advertisement
Update:2019-09-23 05:49 IST

కృష్ణానది కరకట్ట వెంబడి బడాబాబులు అక్రమంగా నిర్మించుకున్న కట్టడాల కూల్చివేతను సీఆర్‌డీఏ మొదలుపెట్టింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని వ్యక్తులకు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.

ఇందులో భాగంగా పాతూరు కోటేశ్వర రావు అనే వ్యక్తికి చెందిన అక్రమ నిర్మాణాలను సీఆర్‌డీఏ సిబ్బంది కూల్చివేస్తున్నారు. నదిలోకి చొచ్చుకువచ్చి వీటిని నిర్మించుకున్నారు.

కరకట్ట వెంబడి ఉన్న మరిన్ని నిర్మాణాలను కూల్చేయబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌ హౌజ్‌కు సీఆర్‌డీఏ నోటీసులు ఇచ్చింది. వారంలోగా నిర్మాణాన్ని తొలగించాలని లేనిపక్షంలో తామే ఆ పని చేయాల్సి ఉంటుందని తుది నోటీసుల్లో సీఆర్‌డీఏ స్పష్టం చేసింది.

అంతకుముందే నోటీసులు జారీ అయిన కట్టడాల తొలగింపును నేటి నుంచే మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మరో మూడు నాలుగు రోజుల్లో లింగమనేని భవనం వైపు కూడా సీఆర్‌డీఏ దృష్టి సారించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News