బాబు కరకట్ట నివాసం కూల్చివేతకు సీఆర్‌డీఏ డెడ్‌లైన్

గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్మించిన చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధమవుతోంది. నదీ నిబంధనలకు విరుద్దంగా కట్టిన ఈ నివాసాన్ని ఖాళీ చేయాలని ఇది వరకే సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. అయినా చంద్రబాబు స్పందించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి సీఆర్‌డీఏ అధికారులు చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించింది. వారంలోగా ఇంటిని కూల్చివేయాలని ఆదేశించింది. లేని పక్షంలో తామే ఇంటిని కూల్చివేస్తామని తాజాగా అతికించిన నోటీసుల్లో స్పష్టం చేశారు. ఎలాంటి […]

Advertisement
Update:2019-09-21 02:36 IST

గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్మించిన చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధమవుతోంది. నదీ నిబంధనలకు విరుద్దంగా కట్టిన ఈ నివాసాన్ని ఖాళీ చేయాలని ఇది వరకే సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. అయినా చంద్రబాబు స్పందించలేదు.

ఈ నేపథ్యంలో మరోసారి సీఆర్‌డీఏ అధికారులు చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించింది. వారంలోగా ఇంటిని కూల్చివేయాలని ఆదేశించింది. లేని పక్షంలో తామే ఇంటిని కూల్చివేస్తామని తాజాగా అతికించిన నోటీసుల్లో స్పష్టం చేశారు.

ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాన్ని ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ గతంలో నోటీసులు జారీ చేయగా… అనుమతులు ఉన్నాయని… వాటిని చూపిస్తామని సమాధానం ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి పత్రాలు చూపలేదని సీఆర్‌డీఏ వివరించింది.

సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని… కాబట్టి వారంలోగా అక్రమ ఇంటిని తొలగించాలని సీఆర్‌డీఏ ఆదేశించింది. లేనిపక్షంలో తామే కూల్చేవేస్తామని చంద్రబాబు ఇంటికి నోటీసులు అతికించారు.

Tags:    
Advertisement

Similar News