ప్రపంచ కుస్తీలో భారత్ కు మరో రెండు కాంస్యాలు
భజరంగ్, రవి దహియాలకు కంచు పతకాలు 2019 ప్రపంచ కుస్తీ పోటీల పురుషుల విభాగంలో భారత్ కు రెండు కాంస్య పతకాలు దక్కాయి.కజకిస్థాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ సెమీస్ లోనే ఓడిన భజరంగ్ పూనియా, రవి దహియా కాంస్యపతకం పోటీలలో నెగ్గి మరో రెండు పతకాలు అందించారు. మహిళల విభాగంలో వినేశ్ పోగట్ కాంస్య పతకంతో భారత్ ను పతకాల పట్టికలో నిలిపింది. రవి దహియా 6-3 గెలుపు… కాంస్యపతకం కోసం ఇరాన్ వస్తాదు […]
- భజరంగ్, రవి దహియాలకు కంచు పతకాలు
2019 ప్రపంచ కుస్తీ పోటీల పురుషుల విభాగంలో భారత్ కు రెండు కాంస్య పతకాలు దక్కాయి.కజకిస్థాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ సెమీస్ లోనే ఓడిన భజరంగ్ పూనియా, రవి దహియా కాంస్యపతకం పోటీలలో నెగ్గి మరో రెండు పతకాలు అందించారు. మహిళల విభాగంలో వినేశ్ పోగట్ కాంస్య పతకంతో భారత్ ను పతకాల పట్టికలో నిలిపింది.
రవి దహియా 6-3 గెలుపు…
8-7తో నెగ్గిన భజరంగ్…
స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ వస్తాదు భజరంగ్ పూనియా చివరకు కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. రిఫరీ పక్షపాత నిర్ణయంతో.. సెమీస్ లో ఓటమి పొందిన భజరంగ్ పూనియా…కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో మంగోలియా వస్తాదు తుల్గా తుమిర్ ఓచిర్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని 8-7 పాయింట్ల తేడాతో నెగ్గి కాంస్య పతకం అందుకొన్నాడు.
పోటీ ప్రారంభంలో 6 పాయింట్లతో వెనుకబడిన భజరంగ్…ఆ తర్వాత చెలరేగిపోయాడు. దూకుడుపెంచి ప్రత్యర్థిపై కీలకపాయింట్లు సాధించడం ద్వారా తన కెరియర్ లో మూడో ప్రపంచ కుస్తీ పతకం సొంతం చేసుకొన్నాడు.
బుడాపెస్ట్ వేదికగా 2013లో జరిగిన ప్రపంచ కుస్తీ టోర్నీలో కాంస్యం నెగ్గిన భజరంగ్ పూనియా…2018 ప్రపంచ కుస్తీ పోటీలలో రజత పతకం సాధించాడు.
ప్రస్తుత టో్ర్నీలో కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అయితే…టోక్యోఒలింపిక్స్ లో పాల్గొనటానికి భజరంగ్ అర్హత సాధించగలగడం విశేషం.
2013 తర్వాత 3 పతకాలు…
ప్రపంచ కుస్తీ పోటీలలో భారత వస్తాదులు మూడు పతకాలు సాధించడం 2013 తర్వాత ఇదే మొదటిసారి. బుడాపెస్ట్ వేదికగా ముగిసిన 2013 ప్రపంచ కుస్తీ టోర్నీలో అమిత్ దహియా, భజరంగ్ పూనియా, సందీప్ తులసీ యాదవ్ భారత్ కు మూడు పతకాలు సాధించి పెట్టారు.
ఆ తర్వాత ఆరేళ్ల విరామం తర్వాత జరిగిన 2019 ప్రపంచ కుస్తీలో వినేశ్ పోగట్, భజరంగ్ పూనియా, రవి దహియా కాంస్య పతకాలు అందించారు. స్టార్ వస్తాదు సుశీల్ కుమార్ తొలిరౌండ్లోనే పరాజయం పొందిన సంగతి తెలిసిందే.