ప్రపంచ టెన్నిస్ టాప్ -100లో ప్రజ్ఞేశ్

159వ ర్యాంక్ లో సుమిత్ నగాల్ ప్రపంచ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ మొదటి 100 స్థానాలలో ..కేవలం ఒకే ఒక్క భారత ఆటగాడు దక్కించుకోగలిగాడు. మొదటి 200 ర్యాంకుల్లో మరో ఇద్దరు భారత ప్లేయర్లు నిలువగలిగారు. ప్రపంచ టెన్నిస్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత డేవిస్ కప్ ఆటగాడు ప్రజ్ఞేశ్ గున్నేశ్వరన్ 82వ ర్యాంక్ తో టాప్-100 ర్యాంకుల్లో కొనసాగుతున్నాడు. ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడంతో పాటు..తొలిరౌండ్లో […]

Advertisement
Update:2019-09-19 06:10 IST
ప్రపంచ టెన్నిస్ టాప్ -100లో ప్రజ్ఞేశ్
  • whatsapp icon
  • 159వ ర్యాంక్ లో సుమిత్ నగాల్

ప్రపంచ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ మొదటి 100 స్థానాలలో ..కేవలం ఒకే ఒక్క భారత ఆటగాడు దక్కించుకోగలిగాడు. మొదటి 200 ర్యాంకుల్లో మరో ఇద్దరు భారత ప్లేయర్లు నిలువగలిగారు.

ప్రపంచ టెన్నిస్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత డేవిస్ కప్ ఆటగాడు ప్రజ్ఞేశ్ గున్నేశ్వరన్ 82వ ర్యాంక్ తో టాప్-100 ర్యాంకుల్లో కొనసాగుతున్నాడు.

ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడంతో పాటు..తొలిరౌండ్లో రోజర్ ఫెదరర్ చేతిలో పరాజయం పొందిన 24 ఏళ్ల సుమిత్ నగాల్ తన కెరియర్ లోనే అత్యుత్తమంగా 159వ ర్యాంక్ సాధించగలిగాడు. ఏకంగా 15 స్థానాలు మెరుగుపరచుకోగలిగాడు.

భారత మరో ఆటగాడు రామ్ కుమార్ రామనాథన్ 179వ ర్యాంక్ లో ఉన్నాడు.

పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్ లో రోహన్ బొపన్న 43, దివిజ్ శరణ్ 49 ర్యాంకుల్లో నిలిచారు.

Tags:    
Advertisement

Similar News