ఈ-సిగరెట్లపై నిషేధానికి కారణం...
దేశంలో అనేక మందికి వ్యసనంగా మారుతున్న ఈ- సిగరెట్లపై కేంద్రం కొరడా ఝులిపించింది. వాటిని నిషేధిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటిని నిషేధిస్తూ తక్షణం ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఏడాది జైలు, లక్ష జరిమానా విధిస్తారు. రెండోసారి తప్పు చేస్తే ఐదు లక్షల జరిమానా లేదా మూడేళ్ల జైలు విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించవచ్చు. ప్రస్తుతం ఈ- సిగరెట్ల వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. మన వాళ్లు […]
దేశంలో అనేక మందికి వ్యసనంగా మారుతున్న ఈ- సిగరెట్లపై కేంద్రం కొరడా ఝులిపించింది. వాటిని నిషేధిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటిని నిషేధిస్తూ తక్షణం ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఏడాది జైలు, లక్ష జరిమానా విధిస్తారు. రెండోసారి తప్పు చేస్తే ఐదు లక్షల జరిమానా లేదా మూడేళ్ల జైలు విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించవచ్చు.
ప్రస్తుతం ఈ- సిగరెట్ల వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. మన వాళ్లు దాదాపు 11 కోట్ల మంది వీటిని వాడేస్తున్నారు. వీటి వినియోగం వల్ల అమెరికాలో చాలా మంది తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకునే వీటిని నిషేధించినట్టు కేంద్రం చెప్పింది.
ఈ- సిగరెట్లలో ద్రవరూపంలో ఉండే నికోటిన్ అంటుంది. ఇది ఈ- సిగరెట్లలో వేడెక్కి ఆవిరిగా మారి పీల్చడానికి వస్తుంది. సంప్రాదాయ పొగాకు, సిగరెట్ల కంటే ఇలా ఆవిరి రూపంలో పొగ పీల్చడం అత్యంత ప్రమాదకరమని ఇటీవల పలు వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. తక్షణం వీటిని నిషేధించాలని పలు నివేదికలు సిఫార్సు చేశాయి. దాంతో కేంద్రం ఆ దిశగానే ఈ- సిగరెట్లపై వేటు వేసింది. అయితే ఇప్పటికే దేశంలోని14 రాష్ట్రాల్లో ఈ- సిగరెట్లపై నిషేధం ఉంది.