బాబు బాధితుల జాబితాలో హైకోర్టు...
చంద్రబాబు పాలన ఎంత నాసిరకంగా సాగింది అన్న దానికి స్వయంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టే సాక్షిగా నిలబడింది. బాధితులకు న్యాయం చేసే కోర్టే బాధితురాలు అయింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాల్లో వందల కోట్లు కాజేసి… వాటిని నాసిరకంగా నిర్మించడం వల్ల వర్షా కాలం వస్తే చాలు అవి జలపాతాలను తలపిస్తున్నాయి. హైకోర్ట్ విషయంలోనూ బాబు అదే నాణ్యత పాటించారు. హైకోర్ట్ లో న్యాయమూర్తులు తిరుగుతుంటారు… తేడా వస్తే బాగోదు అన్న భయం కూడా లేకుండా అత్యంత నాసిరకంగా భవనాన్ని […]
చంద్రబాబు పాలన ఎంత నాసిరకంగా సాగింది అన్న దానికి స్వయంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టే సాక్షిగా నిలబడింది. బాధితులకు న్యాయం చేసే కోర్టే బాధితురాలు అయింది.
అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాల్లో వందల కోట్లు కాజేసి… వాటిని నాసిరకంగా నిర్మించడం వల్ల వర్షా కాలం వస్తే చాలు అవి జలపాతాలను తలపిస్తున్నాయి. హైకోర్ట్ విషయంలోనూ బాబు అదే నాణ్యత పాటించారు.
హైకోర్ట్ లో న్యాయమూర్తులు తిరుగుతుంటారు… తేడా వస్తే బాగోదు అన్న భయం కూడా లేకుండా అత్యంత నాసిరకంగా భవనాన్ని కట్టేసింది అప్పటి బాబు ప్రభుత్వం. దాంతో తాజాగా కురిసిన వర్షానికి హైకోర్టులోకి నీరు చొర బడింది. గోడల వెంబడి చాంబర్స్ లోకి నీళ్ళు వచ్చాయి. సోఫాలు తడిసిపోయాయి. దాంతో సిబ్బంది బక్కెట్లకు పని చెప్పారు.
సోఫాలు, కూలర్లు బయట పెట్టి నీటిని బయటకు ఎత్తే పనిలో ఉన్నారు. హైకోర్టు భవనాన్ని ఇంత నాసిరకంగా నిర్మించడం ఏమిటని కోర్టు సిబ్బంది కంగు తింటున్నారు. కోర్టు పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన నిర్మాణాల విషయంలో నాణ్యత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా నాసిరకంగా భవనం నిర్మించిన వారిపై కోర్టు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా వస్తోంది. చంద్రబాబుపై చర్యలు తీసుకునే సాహసం చేయకపోయినా…. కనీసం సదరు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేయాలని లాయర్లు డిమాండ్ చేస్తున్నారు.