ఏపీలోనూ కంటి వెలుగు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. అదే అందరికి మంచి చూపును ప్రసాదించే వైఎస్ఆర్ కంటి వెలుగు. ఈ నూతన పథకం ద్వారా రాష్ట్రంలో 5.3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. “వచ్చే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కంటి వైద్యం అందేలా చర్యలు తీసుకోండి. ఇందుకోసం 560 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించాం” అని ముఖ్యమంత్రి తెలిపారు. స్పందన కార్యక్రమంతో సహా […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. అదే అందరికి మంచి చూపును ప్రసాదించే వైఎస్ఆర్ కంటి వెలుగు. ఈ నూతన పథకం ద్వారా రాష్ట్రంలో 5.3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
“వచ్చే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కంటి వైద్యం అందేలా చర్యలు తీసుకోండి. ఇందుకోసం 560 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించాం” అని ముఖ్యమంత్రి తెలిపారు. స్పందన కార్యక్రమంతో సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కంటి పరీక్షలతో పాటు కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ చికిత్స, స్ర్కీనింగ్ వంటివి చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలలకు రోజుకు 43 రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అలాగే రక్తహీనతతో బాధపడే చిన్నారులకు కూడా రోజుకు 18 రూపాయల ఖర్చుతో పౌష్టికాహారం అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో ఇసుక కొరతపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. వర్షాలు, వరదల కారణంగా ఇసుక లభ్యత తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. దీంతో వర్షాల ప్రభావం తగ్గిన వెంటనే రాష్ట్రంలో అందరికీ ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని, వర్షాలు, వరదలు తగ్గగాననే వీలైనంత ఇసుకను స్టాక్ యార్డులలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్పందన కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని, స్పందనకు వచ్చిన వినతులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
“ప్రతి ఒక్క లబ్దిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది” అని ముఖ్యమంత్రి అన్నారు. ఉగాదికి అందరికి ఇళ్ల స్థలాలు అందించడంపై కూడా వేగవంతంగా పనులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.