మృతుల కుటుంబాలపట్ల మానవత్వం చాటుకున్న జగన్

ప్రమాదాలలో మరణించిన వారు ఏ రాష్ట్రానికి చెందిన వారో గుర్తించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సాయం ప్రకటిస్తాయి. ఇదంతా గతం… ఆ సంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌ రెడ్డి స్వస్తి పలికారు. మరణించిన వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా తమ రాష్ట్రంలో ప్రమాదం జరిగిందని భావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల నష్టపరిహారం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించిన సంగతి […]

Advertisement
Update:2019-09-16 06:22 IST

ప్రమాదాలలో మరణించిన వారు ఏ రాష్ట్రానికి చెందిన వారో గుర్తించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సాయం ప్రకటిస్తాయి. ఇదంతా గతం… ఆ సంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌ రెడ్డి స్వస్తి పలికారు. మరణించిన వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా తమ రాష్ట్రంలో ప్రమాదం జరిగిందని భావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరిణించిన వారిలో ఆరుగురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. మిగిలిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారుగా ప్రాథమికంగా గుర్తించారు. వీరి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం రెండు రాష్ట్రాల ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఏ రాష్ట్ర్ర ప్రభుత్వం ఇంతటి ఉదార గుణాన్ని చూపించ లేదంటున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షలు నష్ట పరిహారం ప్రకటించింది.

అయితే ప్రమాదం తమ రాష్ట్ర్రంలో జరిగిందనే ఒకే ఒక్క కారణంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కో కుటుంబానికి పది లక్షల పరిహారం ప్రకటించడమే కాకుండా నేరుగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

అంతే కాదు… ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం ఏరియల్ సర్వే కూడా చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య సేవలు అందించేందుకు మంత్రి కురసాల కన్నబాబుతో పాటు స్ధానిక ప్రజాప్రతినిధులను కూడా అప్రమత్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలకు బాధితులు సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News