సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు భారతజట్టు రెడీ
రాహుల్ పై వేటు, శుభ్ మన్ గిల్ కు చోటు అక్టోబర్ 4 నుంచి సఫారీలతో టెస్ట్ సిరీస్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో అక్టోబర్ 4 నుంచి ప్రారంభమయ్యే తీన్మార్ టెస్ట్ సిరీస్ కోసం..15 మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది. భారతజట్టుకే అలంకరణగా మారిన ఓపెనర్ కెఎల్. రాహుల్ ను జట్టు నుంచి తప్పించి…యువఆటగాడు శుభ్ మన్ గిల్ కు చోటు కల్పించారు. అంతేకాదు.. ఇప్పటి వరకూ టీ-20, వన్డే […]
- రాహుల్ పై వేటు, శుభ్ మన్ గిల్ కు చోటు
- అక్టోబర్ 4 నుంచి సఫారీలతో టెస్ట్ సిరీస్
ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో అక్టోబర్ 4 నుంచి ప్రారంభమయ్యే తీన్మార్ టెస్ట్ సిరీస్ కోసం..15 మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది.
భారతజట్టుకే అలంకరణగా మారిన ఓపెనర్ కెఎల్. రాహుల్ ను జట్టు నుంచి తప్పించి…యువఆటగాడు శుభ్ మన్ గిల్ కు చోటు కల్పించారు. అంతేకాదు.. ఇప్పటి వరకూ టీ-20, వన్డే ఫార్మాట్లలో ఓపెనర్ గా వ్యవహరించిన రోహిత్ శర్మ…తన కెరియర్ లో తొలిసారిగా భారతటెస్టు జట్టులో ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు.
విండీస్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోని నాలుగు ఇన్నింగ్స్ లో రాహుల్ 101 పరుగులతో 25.25 సగటు మాత్రమే సాధించడంతో.. ఎంపిక సంఘం ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్ కు దూరంగా ఉంచింది.
సౌతాఫ్రికాతో జరిగే మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో…మయాంక్ అగర్వాల్ తో కలసి భారత ఇన్నింగ్స్ ను రోహిత్ ప్రారంభించనున్నాడు. జట్టు వివరాలను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విడుదల చేశారు.
ఉమేశ్ యాదవ్ కు దక్కని చోటు…
విరాట్ కొహ్లీ నాయకత్వంలోని 15 మంది సభ్యుల భారతజట్టులోని ఇతర ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే,హనుమ విహారీ, రిషభ్ పంత్, శుభ్ మన్ గిల్, చతేశ్వర్ పూజారా, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ ఉన్నారు.
విశాఖ వేదికగా తొలిటెస్ట్ మ్యాచ్..
మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నం ఏసీఏ స్టేడియం వేదికగా ప్రారంభంకానుంది. రెండోటెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి 14 వరకూ పూణే వేదికగాను, మూడోటెస్ట్ అక్టోబర్ 19 నుంచి 23 వరకూ రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగాను జరుగుతాయి.