ఫిరోజ్ షా కోట్లా... ఇక అరుణ్ జైట్లీ స్టేడియం

విరాట్ కొహ్లీ పేరుతో ఢిల్లీ స్టేడియంలో స్టాండ్  న్యూఢిల్లీలో వేడుకగా ముగిసిన కార్యక్రమం భారత రాజధాని ఢిల్లీ నగరానికి చిరునామాగా నిలిచే ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం పేరు ..అరుణ్ జైట్లీ స్టేడియంగా మారింది. న్యూఢిల్లీలో ఢిల్లీ క్రికెట్ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్టేడియం పేరు మార్పుతో పాటు…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ పేరుతో ఓ స్టాండ్ ను సైతం ఏర్పాటు చేశారు. అరుణ్ జైట్లీ సేవలు అపారం… ఢిల్లీ క్రికెట్ అభివృద్ధికి, ఫిరోజ్ షా […]

Advertisement
Update:2019-09-13 05:35 IST
  • విరాట్ కొహ్లీ పేరుతో ఢిల్లీ స్టేడియంలో స్టాండ్
  • న్యూఢిల్లీలో వేడుకగా ముగిసిన కార్యక్రమం

భారత రాజధాని ఢిల్లీ నగరానికి చిరునామాగా నిలిచే ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం పేరు ..అరుణ్ జైట్లీ స్టేడియంగా మారింది. న్యూఢిల్లీలో ఢిల్లీ క్రికెట్ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్టేడియం పేరు మార్పుతో పాటు…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ పేరుతో ఓ స్టాండ్ ను సైతం ఏర్పాటు చేశారు.

అరుణ్ జైట్లీ సేవలు అపారం…

ఢిల్లీ క్రికెట్ అభివృద్ధికి, ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఆధునీకరణ విషయంలో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కృషి అపారమని.. భారత మాజీ ఓపెనర్, డీడీసీఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ చేతన్ చౌహాన్ గుర్తు చేసుకొన్నారు.

అరుణ్ జైట్లీ … ఢిల్లీ అండ్ డిస్ట్ర్రిక్ట్ క్రికెట్ సంఘానికి 14 సంవత్సరాలుగా అధ్యక్షుడి హోదాలో సేవలు అందించారని..
ఆయన నేతృత్వంలోనే కో్ట్లా స్టేడియం రూపురేఖలు సమూలంగా మారిపోయాయని ప్రస్తుత అధ్యక్షుడు రజత్ శర్మ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి, భారత టీ-20 జట్టుసభ్యులు సైతం పాల్గొన్నారు.

విరాట్ కొహ్లీ పేరుతో స్టాండ్..

భారత కెప్టెన్, ప్రపంచ టాప్ ర్యాంక్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ కేవలం మూడుపదుల వయసులోనే ఓ అరుదైన గౌరవం దక్కించుకొన్నాడు.

క్రికెట్లో తాను ఓనమాలు దిద్దుకొన్న న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో తన పేరుతో ఓ స్టాండ్ ను ఏర్పాటు చేయించుకొనే స్థితికి ఎదిగిపోయాడు.

విరాట్ కొహ్లీ ఖుషీ….

2001లో కోట్లా స్టేడియం వేదికగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ చూడటానికి తాను టికెట్ కొన్నానని.. కేవలం 18 ఏళ్ల విరామంలోనే అదే స్టేడియంలో తన పేరుతో ఓ స్టాండ్ ఏర్పాటు చేయటం తనకు అపూర్వ అనుభవమని, గాల్లో తేలిపోతున్న భావన కలుగుతోందని… కొహ్లీ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకొన్నాడు.

డీడీసీఏ హ్యాపీ…

అతిచిన్నవయసులోనే ఢిల్లీ క్రికెటర్ గా తమకు అంతర్జాతీయ గుర్తింపుతో పాటు ఎనలేని గౌరవాన్నితెచ్చిన విరాట్ కొహ్లీ పేరుతో ఓ స్టాండ్ ను ఏర్పాటు చేయడం గర్వకారణమని ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రజత్ శర్మ ప్రకటించారు.

ఫిరోజ్ షా స్టేడియంలో ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు బిషిన్ సింగ్ బేడీ, మొహిందర్ అమర్ నాథ్ ల పేర్లతో
స్టాండ్ లు ఏర్పాటు చేశారు.

ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల రిటైర్మెంట్ తర్వాతే.. స్టేడియంలోని స్టాండ్ లకు పేర్లు పెట్టి ఢిల్లీ క్రికెట్ సంఘం గౌరవించింది. అయితే… కొహ్లీ కేవలం 11 ఏళ్ల క్రికెట్ కెరియర్ లోనే ఈ గౌరవాన్ని పొందటం విశేషం.

వీరూ, అంజుమ్, నెహ్రాల పేర్లతో గేట్లు…

భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీకి హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని ఇచ్చిన ఢిల్లీ క్రికెట్ సంఘం…మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, మాజీ బౌలర్ అశీష్ నెహ్రాల పేర్లతో గేట్లను సైతం ఏర్పాటు చేసి గౌరవించింది.

ముంబైలోని వాంఖెడీ స్టేడియంలో సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్ ల పేర్లతో స్టాండ్లు, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శివలాల్ యాదవ్, వీవీఎస్ లక్ష్మణ్ , డాక్టర్ ఎమ్వీ శ్రీధర్ ల పేర్లతో స్టాండ్లు, గేట్లు ఏర్పాటు చేశారు.

వివిధ దేశాలలోని విఖ్యాత క్రికెట్ స్టేడియాలు సైతం.. .ఇదే సాంప్రదాయాన్ని పాటించడం ద్వారా దిగ్గజ క్రికెటర్లను గౌరవించుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News