తొలి టీ-20 సమరానికి వానగండం

ధర్మశాల స్టేడియం లో కౌంట్ డౌన్ భారత్- సౌతాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ కు…ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. సూపర్ సండే ఫైట్ గా జరిగే ఈ మ్యాచ్ కు వరుణగండం లేకపోలేదని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. బుధవారం నుంచి మూడురోజులపాటు వర్షం పడే అవకాశం ఉందని, మ్యాచ్ జరిగే రోజున ఆకాశం మేఘావృతమై ఉంటుందని కూడా వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఈ […]

Advertisement
Update:2019-09-12 01:46 IST
  • ధర్మశాల స్టేడియం లో కౌంట్ డౌన్

భారత్- సౌతాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ కు…ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

సూపర్ సండే ఫైట్ గా జరిగే ఈ మ్యాచ్ కు వరుణగండం లేకపోలేదని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది.
బుధవారం నుంచి మూడురోజులపాటు వర్షం పడే అవకాశం ఉందని, మ్యాచ్ జరిగే రోజున ఆకాశం మేఘావృతమై ఉంటుందని కూడా వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఈ అందాల క్రికెట్ స్టేడియంలో ఫాస్ట్ బౌలర్ల హవా కొనసాగనుంది. బ్యాటింగ్ అంతతేలికకాదని భావిస్తున్నారు.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, షమీ, భువనేశ్వర్ కుమార్ లేకుండానే పోటీకి దిగుతోంది.

మరోవైపు క్వింటన్ డీ కాక్ నాయకత్వంలోని సఫారీ టీమ్ మాత్రం..రబాడా, జూనియర్ డాలా లాంటి మేటి ఫాస్ట్ బౌలర్లతో సమరానికి సై అంటోంది.

Tags:    
Advertisement

Similar News