30 ఏళ్ల వయసులో గ్రాండ్ స్లామ్ విజేతలు

వయసుతో పనిలేదంటున్న టెన్నిస్ గ్రేట్స్  5 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో నడాల్ టాప్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో విజేతలుగా నిలవాలంటే వయసుతో ఏమాత్రం పనిలేదని స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్, స్విస్ కూల్ కూల్ స్టార్ రోజర్ ఫెదరర్ చాటి చెప్పారు. తగిన ఫిట్ నెస్ తో పాటు నేర్పు, ఓర్పు, అనుభవం ఉంటే చాలునని చెప్పకనే చెబుతున్నారు. కుర్రాళ్ల ఆట కాదు…. ప్రపంచ టెన్నిస్ లో గ్రాండ్ స్లామ్ ( ఫ్రెంచ్ ఓపెన్, […]

Advertisement
Update:2019-09-11 02:17 IST
  • వయసుతో పనిలేదంటున్న టెన్నిస్ గ్రేట్స్
  • 5 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో నడాల్ టాప్

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో విజేతలుగా నిలవాలంటే వయసుతో ఏమాత్రం పనిలేదని స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్, స్విస్ కూల్ కూల్ స్టార్ రోజర్ ఫెదరర్ చాటి చెప్పారు.

తగిన ఫిట్ నెస్ తో పాటు నేర్పు, ఓర్పు, అనుభవం ఉంటే చాలునని చెప్పకనే చెబుతున్నారు.

కుర్రాళ్ల ఆట కాదు….

ప్రపంచ టెన్నిస్ లో గ్రాండ్ స్లామ్ ( ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, ఆస్ట్ర్రేలియన్, యూఎస్ ఓపెన్ ) టైటిల్స్ ను నెగ్గటాన్ని మించిన గౌరవం మరొకటి లేదు.

ఒకే సీజన్లో మొత్తం నాలుగు టైటిల్స్ నెగ్గితే గ్రాండ్ స్లామ్ సాధించినట్లవుతుంది. అదే కెరియర్ లో వేర్వేరు సీజన్లలో నాలుగు టైటిల్స్ నెగ్గిన కెరియర్ గ్రాండ్ స్లామ్ గా పరిగణిస్తారు.

30 ఏళ్ల వయసులో టైటిల్ విన్నర్స్…

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో ఇప్పటి వరకూ అత్యధిక టైటిల్స్ సాధించిన మొనగాడిగా రోజర్ ఫెదరర్ నిలిచాడు. ఫెదరర్ 20 టైటిల్స్ నెగ్గితే , రాఫెల్ నడాల్ 19 టైటిల్స్ తో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. నొవాక్ జోకోవిచ్ 16 టైటిల్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు.

అయితే…30 ఏళ్ల వయసు పైబడిన తర్వాత అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన రికార్డు మాత్రం రాఫెల్ నడాల్ పేరుతోనే ఉంది.

నడాల్ మూడుపదుల వయసు దాటిన తర్వాత 5 టైటిల్స్ నెగ్గాడు. ఫెదరర్ 4, జోకోవిచ్ 4, రాడ్ లేవర్ 4 టైటిల్స్ చొప్పున సాధించి ఆ తర్వాతి స్థానాలలో నిలిచారు.

ఆండ్రీ అగాసీ, జిమ్మీ కానర్స్, స్టాన్ వావరింకా తలో రెండుటైటిల్స్ తో సంయుక్త మూడోస్థానంలో ఉన్నారు.

ఇదంతా చూస్తుంటే…. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కుర్రాళ్ల ఆట ఏమాత్రం కాదని…. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Tags:    
Advertisement

Similar News