అరుదైన రికార్డు.... 20వ సారి గర్భం..!

ఇదో అరుదైన సంఘటన. ఆధునిక ప్రపంచంలో రెండు, మూడు సార్లు గర్భం దాల్చేందుకు మహిళలు అవస్థలు పడుతుంటే ఉత్తర భారతానికి చెందిన ఓ మహిళ ఏకంగా 20 సార్లు గర్భం దాల్చింది. ఈ సంఘటన స్థానికులకే కాదు వైద్య నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా ముజల్ గావు తహసిల్ ప్రాంతం కేసపురికి చెందిన సంచార గోపాల్ కమ్యూనిటీకి చెందిన 38 సంవత్సరాల […]

Advertisement
Update:2019-09-10 06:28 IST

ఇదో అరుదైన సంఘటన. ఆధునిక ప్రపంచంలో రెండు, మూడు సార్లు గర్భం దాల్చేందుకు మహిళలు అవస్థలు పడుతుంటే ఉత్తర భారతానికి చెందిన ఓ మహిళ ఏకంగా 20 సార్లు గర్భం దాల్చింది. ఈ సంఘటన స్థానికులకే కాదు వైద్య నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా ముజల్ గావు తహసిల్ ప్రాంతం కేసపురికి చెందిన సంచార గోపాల్ కమ్యూనిటీకి చెందిన 38 సంవత్సరాల మహిళ లంకాబాయి ఖరత్ కు ఇప్పటి వరకు పదహారు సార్లు సుఖప్రసవం జరిగింది. మరో మూడుసార్లు గర్భస్రావం జరుగగా లంకాబాయి ఖరత్ ప్రస్తుతం ఏడు నెలల నిండు గర్భిణి. ఇవన్నీ కలిపితే ఆ 38 సంవత్సరాల మహిళ 20 సార్లు గర్భం దాల్చినట్లుగా నిర్ధారణ అయింది.

11 మంది సంతానం ఉన్న లంకాబాయి ఖరత్ ఐదుసార్లు తాను జన్మనిచ్చిన శిశువులను కోల్పోయింది. వీరిలో కొందరు గంటల వ్యవధిలో మరణించగా మరికొందరు కొన్ని రోజుల పాటు జీవించి అనంతరం మృతి చెందారు. ఈ మహిళ గురించి తెలుసుకున్న బీడ్ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ అశోక్ థొరాట్ ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు.

“20 సార్లు గర్భం ధరించిన మహిళ ఆరోగ్యం బాగుంది. ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యాన్ని అందిస్తున్నారు మా సిబ్బంది” అని డాక్టర్ అశోక్ థొరాట్ చెప్పారు.

వరుస కాన్పుల వల్ల గర్భసంచి క్షీణించే అవకాశం ఉందని, గర్భస్రావం కూడా ఎక్కువగా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే 20వ సారి గర్భం దాల్చిన లంకాబాయి ఖరత్ పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Tags:    
Advertisement

Similar News