గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తమిళి సై

తెలంగాణ రాష్ట్ర రెండో గవర్నర్‌గా తమిళి సై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ ఆర్‌ఎస్ చౌహాన్‌ … ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం, పలువురు తెలంగాణ, తమిళనాడు మంత్రులు హాజరయ్యారు. కేటీఆర్‌, హరీష్‌రావు ఇద్దరూ కలిసి ప్రమాణస్వీకార […]

Advertisement
Update:2019-09-08 06:01 IST

తెలంగాణ రాష్ట్ర రెండో గవర్నర్‌గా తమిళి సై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ ఆర్‌ఎస్ చౌహాన్‌ … ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం, పలువురు తెలంగాణ, తమిళనాడు మంత్రులు హాజరయ్యారు. కేటీఆర్‌, హరీష్‌రావు ఇద్దరూ కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చారు.

అంతకు ముందు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తమిళిసైకు సీఎం కేసీఆర్‌, మంత్రులు అక్కడ ఘన స్వాగతం పలికారు. పోలీసుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు.

Tags:    
Advertisement

Similar News