లెగ్ స్పిన్ బౌలింగ్ గ్రేట్ అబ్దుల్ ఖాదీర్ మృతి

లెగ్ స్పిన్‌ బౌలింగ్ కు సరికొత్త గ్లామర్ తెచ్చిన ఖాదీర్ 64 టెస్టులు, 104 వన్డేల్లో 368 వికెట్లు లెగ్ స్పిన్ బౌలింగ్ కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన పాక్ దిగ్గజ బౌలర్, మణికట్టు మాంత్రికుడు అబ్దుల్ ఖాదిర్…లాహోర్ లోని స్వగృహంలో గుండె ఆగి మరణించారు. 63 ఏళ్ల ఖాదీర్ కు భార్య, నలుగురు కుమార్లు, ఓ కుమార్తె ఉన్నారు. 1970-80 దశాబ్దకాలంలో ప్రపంచ మేటి బౌలర్ గా పేరుపొందిన ఖాదీర్ తన బౌలింగ్ యాక్షన్ తో […]

Advertisement
Update:2019-09-07 10:10 IST
  • లెగ్ స్పిన్‌ బౌలింగ్ కు సరికొత్త గ్లామర్ తెచ్చిన ఖాదీర్
  • 64 టెస్టులు, 104 వన్డేల్లో 368 వికెట్లు

లెగ్ స్పిన్ బౌలింగ్ కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన పాక్ దిగ్గజ బౌలర్, మణికట్టు మాంత్రికుడు అబ్దుల్ ఖాదిర్…లాహోర్ లోని స్వగృహంలో గుండె ఆగి మరణించారు.

63 ఏళ్ల ఖాదీర్ కు భార్య, నలుగురు కుమార్లు, ఓ కుమార్తె ఉన్నారు.

1970-80 దశాబ్దకాలంలో ప్రపంచ మేటి బౌలర్ గా పేరుపొందిన ఖాదీర్ తన బౌలింగ్ యాక్షన్ తో పాటు లెగ్ బ్రేక్ లు, గుగ్లీలు సంధించడంలో దిట్టగా పేరుపొందారు.

తన కెరియర్ లో ఆడిన 64 టెస్టులు, 104 వన్డేల్లో ఖాదిర్ కు 368 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. ఖాదిర్ మృతి పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పలువురు మాజీ క్రికెటర్లు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News